కట్టప్ప నమ్మక ద్రోహమే అసలు కథ

Update: 2016-02-07 11:30 GMT
2015లో సమాధానం దొరక్కుండా మిగిలిపోయిన అతి పెద్ద మిస్టరీ ఏంటంటే.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే? మరి దీనికి సమాధానం దొరికేది బాహుబలి సెకండ్ పార్ట్ లోనే అని తెలుసు. ఈ లోగా ఆన్సర్ దొరికే అవకాశం లేదు కానీ.. ఈ ద్రోహం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ చెప్పాడు దర్శకధీరుడు రాజమౌళి.

ఇప్పటికే బాహుబలి ది కంక్లూజన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ప్రభాస్ పై ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరిగిపోతోంది. రెబెల్ స్టార్ తర్వాత మిగిలిన పాత్రల షూటింగ్ మొదలుకానుంది. ఇప్పుడు బాహుబలి2 షూటింగ్ తో ప్రమోషన్స్ ని కూడా చేస్తున్నాడు జక్కన్న. రీసెంట్ గా ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడీయన. అందులో ఈ కట్టప్ప ద్రోహం కూడా ఒకటి. అసలు కట్టప్ప చేసిన గురించి చెప్పాలంటే.. అది ఒక్క మాటతోనో ఒక లైన్ తోనో చెప్పడం సాధ్య కాదట.

రెండో భాగంలో కట్టప్ప ద్రోహం గురించి ఖచ్చితంగా సమాధానం ఉంటుందని చెప్పిన రాజమౌళి.. దాని వెనుక చాలా పెద్ద నేపథ్యం ఉంటుందన్నాడు. ఇంకా చెప్పాలంటే.. అసలు స్టోరీ అంతా కట్టప్ప చేసిన ద్రోహం మీదే ఆధారపడి ఉంటుందన్నాడు మన దర్శకధీరుడు. ఆసక్తిని పెంచుకుంటూ వెళ్లడం.. సినిమాల్లోనే కాదు.. ఇంటర్వ్యూల్లోనే కంటిన్యూ చేసేస్తున్నాడు. ఇప్పటివరకూ ద్రోహం ఏంటి అనుకునే వాళ్లకు.. ఇప్పుడు కథంతా అదే అనడంతో.. మరింత ఇంట్రెస్ట్ మొదలైపోయింది.
Tags:    

Similar News