Bigg Boss Telugu 10: రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇష్యూ చేసిన నాగార్జున!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హౌస్‌లో పెరుగుతున్న గొడవలకి విస్తుపోయిన హోస్ట్ నాగార్జున ఈ వారాంతపు ఎపిసోడ్‌లో గట్టిగానే కొరడా ఝుళిపించారు
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హౌస్‌లో పెరుగుతున్న గొడవలకి విస్తుపోయిన హోస్ట్ నాగార్జున ఈ వారాంతపు ఎపిసోడ్‌లో గట్టిగానే కొరడా ఝుళిపించారు. ముఖ్యంగా టైటిల్ ఫెవరేట్‌గా దూసుకుపోతున్న కంటెస్టెంట్ రోహిత్‌కు 'బ్లాక్ బ్యాడ్జ్' ఇచ్చి కెప్టెన్సీ కంటెండర్ గా ఉండే అవకాశం లేదని ఖరారు చేసారు.
తోటి కంటెస్టెంట్‌తో గొడవ సందర్భంగా రోహిత్ హద్దులు దాటి ప్రవర్తించడం, బెదిరింపులకు పాల్పడడమే ఈ తీవ్ర నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. బిగ్‌బాస్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను తీవ్రంగా ఉల్లంఘించడంతో హోస్ట్ నాగార్జున సీరియస్‌గా స్పందించారు. ఒక స్పెషల్ వీడియో ప్లే చేసి మరీ రోహిత్ ఆట తీరు ఎలా ఉందొ చూపించే ప్రయత్నం చేసారు.
బిగ్‌బాస్ ఫార్మాట్‌లో 'బ్లాక్ బ్యాడ్జ్' అనేది అత్యంత తీవ్రమైన శిక్షగా పరిగణిస్తారు. అయితే, నాగార్జున ఎదుట రోహిత్ తన తప్పును తెలుసుకుని క్షమాపణ కోరడంతో, ఈ శిక్షను కొద్దిగా సడలించే అవకాశం కూడా ఉంది. సీజన్ మొత్తం కాకుండా కేవలం రెండు వారాల పాటు మాత్రమే అతను కెప్టెన్సీకి పోటీ పడకుండా నిషేధం విధించినట్లు తెలుస్తోంది.
ఇకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, సీక్రెట్ రూమ్ నుంచి షాలిని ఊహించని రీ-ఎంట్రీ తర్వాత హౌస్‌లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా రోహిత్ - త్రిగుణ్‌ల మధ్య నడుస్తున్న యుద్ధం, గ్రూప్ పాలిటిక్స్ ఆటను మరింత రసవత్తరంగా మార్చాయి.
మరోవైపు ఈ ఏడో వారం ఎలిమినేషన్ కోసం ఏకంగా 12 మంది కంటెస్టెంట్లు - రోహిత్, త్రిగుణ్, అమన్, రామకృష్ణ, శ్వేత, నీతు, వంశీ, వర్షిణి, ఝాన్సీ, సుధీర్, శివ, దక్ష డేంజర్ జోన్‌లో ఉన్నారు.
తాజాగా వస్తున్నా వార్తల ప్రకారం దక్ష ఎలిమినేట్ అయినట్టు సమాచారం వస్తుంది. అంతే కాకుండా, షాలిని కూడా హౌజ్ నుంచి బయటకొచ్చే అవకాశం ఉంది.