పూరీకి ద‌ర్శ‌కేంద్రుడి స‌పోర్ట్.. ఆ పంచ్ ఏ హీరోపై?

Update: 2020-03-02 04:49 GMT
ఇండ‌స్ట్రీ స‌క్సెస్ వెంటప‌డుతుంది. స‌క్సెస్ ఉంటేనే ఛాన్స్ ఇస్తామని వెంట‌ప‌డ‌తారు. స‌క్సెస్ లేదంటే ద‌రిదాపుల్లోకి కూడా రారు. ఇక్క‌డ ఏరోజు కారోజే.. ప్ర‌తిసారీ స‌క్సెస‌వ్వాల్సిందే. నేటి ఇండ‌స్ట్రీ తీరు ఇలా ఉంది. స‌క్సెస్ లేక‌పోయినా చాలా అరుదుగా మాత్ర‌మే ఫెయిల్యూర్ డైరెక్ట‌ర్ల‌కి అవ‌కాశాలిస్తుంటారు హీరోలు. దాదాపు నేటిత‌రం స్టార్ హీరోలంద‌రూ అదే పంథాలో వెళ్తున్నారు. ఇటీవ‌లే ఓ స్టార్ హీరోని టార్గెట్ చేసి డ్యాషింగ్ డైరెక్ట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ హీరోకి నేను ఇచ్చిన స‌క్సెస్ లు ఇప్పుడు గుర్తుకు రావ‌డం లేదు. అందుకేమో దూరంగా ఉంటున్నాడు. ఇక్క‌డ స‌క్సెస్ మాత్ర‌మే మాట్లాడుతుందని.. అంత‌కు మించి మ‌రో ఎమోష‌న్ ఉండ‌ద‌ని బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆ మాట ఆ నోటా ఈనోటా హీరోకి చేరింది. దాంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా చెడింది కూడా.

తాజాగా ఇలాంటి స‌న్నివేశాన్నిఉద‌హ‌రించి ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ఓ ఈవెంట్లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. వేదిక‌ పై ఉన్న మెగాస్టార్ ని ఉద్ధేశించి ఆయ‌న‌ చాలా గొప్పోడు అంటూ ఔన్న‌త్యాన్ని కొనియాడారు. సినిమా హీరోకి..ద‌ర్శ‌కుడికి హిట్లు..ప్లాప్ లు రెండు స‌హ‌జ‌మే. కానీ ఒక సీజ‌న్ లో ప్లాప్ వ‌చ్చిన‌ప్పుడు ఎంక‌రేజ్ చేసిన వారే గొప్పోళ్లు. అలాంటి గొప్ప హీరో చిరంజీవి గారు. నాకు వ‌రుస‌గా రెండు ప్లాప్ లు వ‌చ్చాయి. అప్పుడే `జ‌గ‌దేకవీరుడు అతిలోక సుంద‌రి` సినిమా చేద్దామ‌ని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. నా ప్లాప్ లు చూసి అత‌నితో చేద్దామా లేదా అని చిరంజీవి గారు..అశ్వీనిద‌త్ గారు చ‌ర్చించుకున్నారు.

చివ‌రిగా చిరంజీవిగారు ఏమ‌నుకున్నారో ఏమో! అతిలోక సుంద‌ర‌నీ..జ‌గ‌దీక‌వీరుడిని క‌ల‌ప‌డం అంటే రాఘ‌వేంద్ర‌రావుకే సాధ్య‌మవుతుంద‌న న‌మ్మి అవ‌కాశం ఇచ్చారు. ఆ స‌క్సెస్ త‌ర్వాత ఇద్దురు మిత్రులు చేసి హిట్టు కొట్టా. ఆ స‌క్సెస్ తోనే నా కుమార్తె పెళ్లి చేసా. అంత‌కు ముందు డ‌బ్బులు లేవ‌ని కాదు. ఆ స‌మ‌యంలో డ‌బ్బులేని ప‌రిస్థితి. అలా నా జీవితంలో చిరంజీవి మంచికి..చెడుకి మ‌ధ్య ఉన్నారు. స‌క్సెస్ ని ఎంత బ‌లంగా న‌మ్ముతామో ..ఫెయిల్యూర్స్ ని అతే బ‌లంగా న‌మ్మి... స‌క్సెస్ ఎందుకు రాద‌ని ప్రయ‌త్నించి న‌మ్మ‌కంతో అవ‌కాశాలు ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కేంద్రుడు చెప్ప‌క‌నే చెప్పారు. సీనియ‌ర్ పాత్రికేయులు వినాయ‌క‌రావు ర‌చించిన `మెగాస్టార్ ది లెజెండ్` పుస్త‌కావిష్క‌ర‌ణ‌లో కె.రాఘ‌వేంద్ర‌రావు ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇది కొంత మంది స్టార్ హీరోల వైఖ‌రిపై పంచ్ వేయ‌డ‌మేన‌ని భావించాలి.


Tags:    

Similar News