వెబ్ సిరీస్ లో రాశి.. ఏడేళ్ల తర్వాత బ్యాక్

Update: 2020-12-26 05:15 GMT
‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నార్త్ బ్యూటీ రాశీ ఖన్నా. ఆ తర్వాత గోపిచంద్‌ సరసన ‘జిల్’, జూనియర్ ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’ సినిమాలు చేసిన ఈ ఢిల్లీ భామ.. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొట్టింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'తో సూపర్ హిట్ అందుకుంది ఈ భామ.

ఇంకా.. బెంగాల్ టైగర్, సుప్రీం, హైపర్, శ్రీనివాస కళ్యాణం తదితర సినిమాల్లో నటించినప్పటికీ.. నెంబర్ వన్ పొజిషన్ కు మాత్రం చేరుకోలేకపోయింది. కాగా.. ఇప్పుడు ఈ అమ్మడు బ్యాక్ టూ పెవిలియన్ అంటూ బాలీవుడ్ చెక్కేస్తోంది. లేటెస్ట్ గా ఓ వెబ్ సిరీస్ కు సైన్ చేసిందట. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ రూపొందించిన రాజ్ & డికె.. తన లేటెస్ట్ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు.

జాన్ అబ్రహం నటించిన ‘మద్రాస్ కేఫ్’ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది రాశీఖన్నా. ఆ తర్వాత సౌత్ కి షిఫ్ట్ అయిన రాశీ.. టాలీవుడ్, కోలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. ఆమె ‘మద్రాస్ కేఫ్’లో నటించి 7 సంవత్సరాలు గడిచాయి. ఇంత కాలం తర్వాత బ్యాక్ టూ హోమ్ అంటూ బాలీవుడ్‌ కి వెళ్లింది ఈ బ్యూటీ. తన లేటెస్ట్ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Tags:    

Similar News