'లవ్ మ్యారేజ్ ఇష్టం' అంటున్న స్టార్ హీరోయిన్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం అభినయంతో కుర్రకారుకి మతిపోగొడుతోంది ఈ భామ. తొలి సినిమా ఊహలు గుసగుసలాడేతోనే స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ పై ఊహలు పెంచుకుంటూ అడుగుపెట్టిన రాశిఖన్నా.. అందాలను రాసులుగా పోసుకొని గ్లామర్ ప్రపంచంపై దండయాత్ర మొదలుపెట్టింది. ఇక అప్పటి నుండి వరుస అవకాశాలతో స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తోంది. కెరీర్లో జిల్ - తొలిప్రేమ - వంటి సినిమాలు మంచి కొట్టాయి. ఆ తరువాత వచ్చిన శ్రీనివాస కళ్యాణం పెద్దగా ఆడకపోవడంతో కెరీర్ డైలమాలో పడింది. ఇటీవలే వెంకిమామతో డీసెంట్ హిట్ అందుకుంది. అటు తమిళంలో విజయ్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది. సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటోంది భామ. ప్రస్తుత లాక్ డౌన్ సమయాన్ని రాశి బాగా ఉపయోగించుకుంటుంది.
తాజాగా రాశీఖన్నా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన సందేహాలకు ఎంతో ఓపికతో సమాధానం ఇచ్చింది. లాక్ డౌన్ టైంలో పుస్తకాలు చదవడంతో పాటు ఇన్ స్పిరేషన్ కలిగించే వీడియోలు చూస్తున్నట్టు రాశీ తెలిపింది. ఎప్పుడూ నవ్వుతూ - నవ్విస్తూ ఆనందంగా గడపడానికి కారణాలేంటి అనే ప్రశ్నకు రాశి స్పందించి.. కుటుంబం - స్నేహితులు - అభిమానులు చూపించే ప్రేమ అని చెప్పింది. ఇక తెలుగులో తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే.. సమంత అని ఠక్కున చెప్పింది. థియేటర్లో తాను చూసిన తొలి సినిమా టైటానిక్ అని.. అలాగే మహేశ్ బాబు - అల్లు అర్జున్ ల సరసన నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాట బయటపెట్టింది. ఇక చివరగా.. రాశిని ఓ అభిమాని ఆసక్తికర విషయం అడిగాడు. మీకు అరెంజ్ మ్యారేజ్ ఇష్టమా.. లవ్ మ్యారేజ్ ఇష్టమా అని అడిగిన ప్రశ్నకు రాశి స్పందిస్తూ.. లవ్ మ్యారేజ్ అని చెప్పింది. ఇక ఈ విషయం తెలిసినప్పటి నుండి ఫ్యాన్స్ లో పండగ వాతావరణం మొదలైంది.