రౌడీతో ప్రకటించిన ప్రాజెక్ట్ క్రేజీ స్టార్‌దా?
ఒక స్టార్‌తో చేయాలనుకున్న ప్రాజెక్ట్‌లు మరో స్టార్‌కు వెళ్లిపోయినవి..ఆ తరువాత బ్లాక్ బస్టర్‌లుగా నిలిచినవి చాలానే ఉన్నాయి.;
ఒక స్టార్‌తో చేయాలనుకున్న ప్రాజెక్ట్‌లు మరో స్టార్‌కు వెళ్లిపోయినవి..ఆ తరువాత బ్లాక్ బస్టర్‌లుగా నిలిచినవి చాలానే ఉన్నాయి. అలా చేతులు మారిన సినిమాలు కొంత మంది కెరీర్‌ని మలుపు తిప్పితే మరి కొంత మంది కెరీర్‌లో క్లాసిక్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు మరో క్రేజీ భారీ మూవీ ఇలాగే చేతులు మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అదే విజయ్ దేవరకొండ -శౌర్యవ్ మూవీ. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో `హాయ్ నాన్న` ఫేమ్ శౌర్యవ్ ఓ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే.
రీసెంట్‌గా ఈ ప్రాజెక్ట్‌ని వినూత్న పద్దతిలో ప్రకటించారు. `వీడీ - శౌర్యవ్` అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. హీరో విజయ్ దేవరకొండ ఈ పోస్టర్‌లో స్టైలిష్ డ్రెస్‌లో కనిపిస్తూ చేతులకు యుద్ధ వీరుడిలా కవచాలు ధరించి నాలుగు బ్లాక్ డాగ్స్‌ని గొలుసులతో పట్టుకుని వెళుతున్న స్టిల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ వెనకాలే డైరెక్టర్ శౌర్యవ్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహెబ్ వరకు ఆయుధాలు పట్టుకుని వెంట నడుస్తున్నట్టుగా కనిపించిన తీరు టీమ్ అంతా కలిసి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారనే ఫీల్‌ని కలిగించింది.
`ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమే` అంటూ పోస్టర్‌లో క్యాప్షన్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. `హాయ్ నాన్న`తో ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న శౌర్యవ్ తాజా మూవీని మైథలాజికల్ యూనివర్స్‌లో సాగే ఆసక్తికరమైన స్టోరీతో గ్లోబల్ మూవీగా తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఇందు కోసం హాలీవుడ్ టెక్నీషియన్‌లని సైతం రంగంలోకి దించేశాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీ తెరపైకి రాబోతోంది. అయితే ఈ స్టోరీని ముందు వేరే హీరోతో చేయాలనుకున్నాడట డైరెక్టర్ శౌర్యవ్.
ఆ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని తెలిసింది. తనదో సినిమా చేసి నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోవాలని శౌర్యవ్ ముందు ప్లాన్ చేసుకున్నాడట. ఆ కారణంగానే `హాయ్ నాన్న` రిలీజ్ అయి ఇంత కాలం అవుతున్నా మరో సినిమాని పట్టాలెక్కించలేదట. అయితే ఎన్టీఆర్‌కున్న కమిట్‌మెంట్‌లు పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ముందు చేస్తున్న `డ్రాగన్` పూర్తి చేయాలి. ఆ తరువాత త్రివిక్రమ్ ఫిల్మ్. ఇవి పూర్తయ్యేంత వరకు ఆగే టైమ్ శౌర్యవ్‌కు లేదు.
ఆ కారణం వల్లనే ఎన్టీఆర్‌తో చేయాలనుకున్న స్టోరీని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు వినిపించి ఫైనల్ చేయించుకున్నాడట. విజయ్‌కి స్టోరీ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం, ప్రొడ్యూసర్స్ కూడా రెడీ అయిపోవడంతో దీనికి సంబంధించిన పనులు చక చకా జరిగిపోతున్నాయని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ `రౌడీ జనార్థన`తో పాటు రాహుల్ సంక్రీత్యన్ రూపొందిస్తున్న పీరియాడిక్ డ్రామా `రణబాలి` చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ దాదాపుగా పూర్తి కావస్తోంది. ఇవి పూర్తయిన వెంటనే శౌర్యవ్ మైథలాజికల్ డ్రామా పట్టాలెక్కుతుందని తెలిసింది.