'సిసింద్రీ 2'గా అఖిల్ వారసుడు.. మరి తండ్రి ఎవరు?

ఒక చిన్నారి నవ్వు.. అమాయకమైన చూపులు.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్.. ఇవన్నీ కలిపి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన సినిమా సిసింద్రీ. 1995లో వచ్చిన ఆ మూవీ అప్పటి ప్రేక్షకులకు ఓ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.

Update: 2026-07-25 18:30 GMT

ఒక చిన్నారి నవ్వు.. అమాయకమైన చూపులు.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్.. ఇవన్నీ కలిపి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన సినిమా సిసింద్రీ. 1995లో వచ్చిన ఆ మూవీ అప్పటి ప్రేక్షకులకు ఓ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇప్పుడు అదే సిసింద్రీ మరోసారి టాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది. అయితే ఈసారి స్క్రీన్ పైకి రాబోయేది అఖిల్ కాదు.. అఖిల్ వారసుడు అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది.

అక్కినేని అఖిల్ తాజాగా చేసిన కామెంట్స్ ఆ చర్చకు కారణమయ్యాయి. తనకు కొడుకు పుడితే సిసింద్రీ 2 చేయాలనే ఆలోచన ఉందని అఖిల్ వెల్లడించారు. ఈ విషయాన్ని తన భార్య జైనబ్‌ కు కూడా చెప్పినట్లు తెలిపారు. తన చిన్ననాటి సినిమాతో వచ్చిన గుర్తింపును తన తర్వాతి జనరేషన్ కు కూడా అందించాలనే కోరికను అఖిల్ బయటపెట్టారు. అఖిల్ కామెంట్స్ తో అక్కినేని అభిమానుల్లో నాటి మెమోరీస్ మరోసారి తెరపైకి వచ్చాయి.

సిసింద్రీలో ఏడాది వయసున్న క్యూట్ బేబీగా కెమెరా ముందుకొచ్చిన అఖిల్.. తన క్యూట్ పెర్ఫార్మెన్స్‌ తో అప్పట్లో అందరినీ ఆకట్టుకున్నాడు. చిన్న వయసులోనే స్టార్ ఇమేజ్‌ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అదే మ్యాజిక్‌ ను తన వారసుడితో కొనసాగించాలని భావించడం ఆసక్తిని రేపుతోంది. అసలు సిసింద్రీ సినిమా అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉన్న చిత్రం. నాగార్జున స్వయంగా నిర్మించడంతో పాటు సినిమాలో కీలక పాత్ర పోషించారు.

హాలీవుడ్ మూవీ బేబీస్ డే అవుట్ ఆధారంగా రూపొందిన ఆ సినిమా కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఓ చిన్నారి చుట్టూ తిరిగే ఎంటర్టైనింగ్ స్టోరీ, అఖిల్ అమాయక యాక్టింగ్ ఆ సినిమాను అప్పట్లో పెద్ద విజయంగా నిలిపాయి. అక్కినేని కుటుంబంలో వారసుల పరిచయాలకు కూడా ఓ స్పెషల్ హిస్టరీ ఉంది. అక్కినేని నాగేశ్వరరావు చిన్ననాటి పాత్రలో కనిపించిన తర్వాత నాగార్జున నట వారసత్వాన్ని కొనసాగించారు.

ఇక నాగార్జున తనయుడిగా అఖిల్ సిసింద్రీ ద్వారా చిన్నతనంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు అఖిల్ ఆలోచిస్తున్న సిసింద్రీ 2తో ఈ వారసత్వం మరో జనరేషన్ కు చేరుతుందా అనే ఆసక్తి మొదలైంది. అయితే సిసింద్రీ 2 ఎప్పుడు వస్తుంది? అందులో తండ్రిగా ఎవరు నటిస్తారు? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం లేదు.

ఇది కేవలం అఖిల్ వ్యక్తిగత ఆలోచన మాత్రమే. కానీ ఒకవేళ ఆ ఆలోచన నిజమైతే.. అక్కినేని కుటుంబంలో నాలుగో జనరేషన్ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హీరోగా తన కెరీర్‌ ను కొనసాగిస్తున్న అఖిల్.. తన ఫ్యూచర్ జనరేషన్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంట్స్ అభిమానుల్లో నోస్టాల్జియాను పెంచుతున్నాయి. ఒకప్పుడు చిన్నారి సిసింద్రీగా ప్రేక్షకులను అలరించిన అఖిల్.. ఇప్పుడు తండ్రి పాత్రలో తన వారసుడిని అదే పాత్రలో చూడాలని కోరుకోవడం విశేషం. మరి అఖిల్ కలలో ఉన్న సిసింద్రీ 2 ఎప్పుడు నిజమవుతుందో చూడాలి.

Tags:    

Similar News