రిలీజ్ కాకుండానే సీరియల్ అంటే ఎలా?
మలయాళ చిత్ర పరిశ్రమలో దృశ్యం సృష్టించిన సంచలనం గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో సైతం రీమేక్ అయి ఇక్కడా మంచి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే.;
మలయాళ చిత్ర పరిశ్రమలో దృశ్యం సృష్టించిన సంచలనం గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో సైతం రీమేక్ అయి ఇక్కడా మంచి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న దృశ్యం 3 రిలీజ్ కు సమయం ఆసన్నమైంది. మేలో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే రిలీజ్ కు ముందే ఈ సిరీస్ మేకింగ్ శైలి నెట్టింట సచంలనంగా మారింది. ఈ సినిమా మేకింగ్ శైలి, రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సీరియల్స్ మేకింగ్ ను తలపిస్తుందంటూ నెట్టింట కామెంట్లు పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా విమర్శలపై దర్శకుడు జీతూ జోసెఫ్ ఘాటుగా స్పందించారు. దృశ్యం సినిమాల్లో విజువల్స్ లేదా మేకింగ్ స్టైల్ టెలివిజన్ సీరియల్స్‌ను పోలి ఉంటుందనే విమర్శలను పూర్తిగా తోసిపుచ్చారు. సినిమా కథాంశం ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతున్నప్పుడు దానిని అత్యంత విలాసవంతంగా లేదా భారీగా చూపించడం సాధ్యం కాదన్నారు. కథలోని సహజత్వాన్ని కాపాడటానికే ప్రాధాన్యత ఇస్తానని అనవసరమైన హంగుల కోసం సినిమా మూల కథను పక్కదారి పట్టించలేనన్నారు.
మోహన్‌లాల్ పోషించిన జార్జ్‌కుట్టి పాత్రకు ఉన్న పాపులారిటీ గురించి మాట్లాడారు. ఆ పాత్రలోని సాధారణ తత్వమే ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుందని అభిప్రాయపడ్డారు. `దృశ్యం 3 లో కూడా అదే రియలిజం కొన సాగుతుందని కథా బలం మీద ఉన్న నమ్మకంతోనే తాను ముందుకు సాగుతున్నా అన్నారు. విమర్శకులు మేకింగ్ గురించి మాట్లాడే ముందు కథలోని లోతును, అందులోని భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని సూచించారు.
సినిమా అంటే కేవలం భారీ గ్రాఫిక్స్ లేదా ఖరీదైన సెట్లు మాత్రమే కాదని, ప్రేక్షకుడిని కథలో మమేకం చేయడమే అసలైన సినిమా అని జీతూ జోసెఫ్ అభిప్రాయపడ్డారు. దృశ్యం రెండు భాగాలు సాధించిన ఘనవిజయం తన బాధ్యతను పెంచిందని, మూడవ భాగం అంతకంటే పకడ్బందీగా ఉండబోతోందని ధీమా వ్యక్తం చేశారు. విజువల్స్ కోసం కాకుండా, ఉత్కంఠభరితమైన కథనం కోసం సినిమా చూడాలని ప్రేక్షకుల్ని కోరారు.
మూడవ భాగం తో ఈ ఫ్రాంచైజీకి ముగింపు పలుకుతారా? లేదా? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. దీనిపై జీతూ జసెఫష్ స్పందించారు. కథ డిమాండ్ చేస్తేనే తదుపరి భాగాలు ఉంటాయని కేవలం డబ్బు కోసం సినిమాను సాగదీయడం ఇష్టం లేదన్నారు. దృశ్యం 3 లో జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం మునుపటి కంటే భిన్నంగా , ఉత్కంఠభరితంగా ఉంటుందని జీతూ జోసెఫ్ హామీ ఇచ్చారు.