మ్యూజిక్ కూడా బాక్సాఫీస్‌ లాగే బిగ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే కోట్ల రికవరీ

ఒకప్పుడు సినిమా బిజినెస్ అంటే థియేట్రికల్, శాటిలైట్, ఓవర్సీస్ రైట్స్ గురించే ఎక్కువగా డిస్క‌ష‌న్ జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.

Update: 2026-07-31 07:53 GMT

ఒకప్పుడు సినిమా బిజినెస్ అంటే థియేట్రికల్, శాటిలైట్, ఓవర్సీస్ రైట్స్ గురించే ఎక్కువగా డిస్క‌ష‌న్ జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మ్యూజిక్ రైట్స్ కూడా బాక్సాఫీస్‌కు సమానంగా పెద్ద బిజినెస్‌గా మారాయి. సినిమా థియేటర్లలోకి రాకముందే నిర్మాతలకు భారీ మొత్తంలో ఆదాయం తీసుకొచ్చే ప్రధాన వనరుగా ఆడియో రైట్స్ నిలుస్తున్నాయి. తాజా మ్యూజిక్ రైట్స్ డీల్స్ ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి.

ప్రస్తుతం భారతీయ సినిమాల్లో అత్యధిక మ్యూజిక్ రైట్స్ డీల్స్ లిస్ట్ లో రామాయణ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ఏకంగా రూ. 75 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల్లో డిస్క‌ష‌న్ జరుగుతోంది. ఇది ఇండియన్ సినిమా మ్యూజిక్ మార్కెట్‌కు కొత్త బెంచ్‌మార్క్‌గా భావిస్తున్నారు. రామాయ‌ణ త‌ర్వాత ధురంధ‌ర్2 రూ.58 కోట్ల‌తో రెండో స్థానంలో ఉండ‌గా, పుష్ప‌2 రూ.55 కోట్ల‌తో మూడ‌వ ప్లేస్ లో నిలిచింది. కింగ్ సినిమా రూ.45 కోట్లు, జ‌వాన్ రూ.36 కోట్ల‌తో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ లిస్ట్‌ను పరిశీలిస్తే మరో ఇంట్రెస్టింగ్ విష‌యం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ భారీ స్థాయి పాన్ ఇండియా ప్రాజెక్టులే. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్‌లు, దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్ కెపాసిటీ, డిజిటల్ స్ట్రీమింగ్ డిమాండ్ వంటి అంశాలు మ్యూజిక్ రైట్స్ వాల్యూని భారీగా పెంచుతున్నాయి.

నిర్మాతల దృష్టిలో ఇది కేవలం ఆడియో హ‌క్కుల అమ్మకం మాత్రమే కాదు, సినిమా రిలీజ్ కు ముందే రిస్క్ తగ్గించే ఆర్థిక భద్రత కూడా. మ్యూజిక్ రైట్స్, ఓటీటీ, శాటిలైట్, ఓవర్సీస్ రైట్స్ ద్వారా సినిమా పెట్టుబడిలో గణనీయమైన భాగం ముందుగానే రికవరీ అవుతోంది. దీంతో థియేట్రికల్ కలెక్షన్లపైనే పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం తగ్గుతోంది.

యూట్యూబ్, స్పాటిఫై, జియోసావన్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ కూడా ఈ మార్కెట్‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఒక సాంగ్ వైరల్ అయితే దాని కమర్షియల్ వాల్యూ నెలల తరబడి కొనసాగుతోంది. అందుకే మ్యూజిక్ కంపెనీలు భారీ మొత్తాలు పెట్టుబడి పెట్టడానికి సైతం వెనుకాడటం లేదు.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూసుకుంటే మ్యూజిక్ రైట్స్ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో కీలక స్థంభంగా మారాయి. రామాయణ రూ. 75 కోట్ల డీల్ తర్వాత ఫ్యూచ‌ర్ లో రూ. 100 కోట్ల మ్యూజిక్ రైట్స్ డీల్ కూడా అసాధ్యమని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇండియ‌న్ మూవీ బిజినెస్ లో మ్యూజిక్ ఇప్పుడు నిజంగానే మరో బాక్సాఫీస్‌గా మారింది.

Tags:    

Similar News