బన్నీ-అట్లీ కాంబో.. క్రేజ్ తో ఇలా..

ఒకరు స్టైలిష్ పెర్ఫార్మెన్స్‌ తో పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో.. మరొకరు మాస్ ఎంటర్టైనర్లతో బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ చూపించిన దర్శకుడు.

Update: 2026-07-31 06:26 GMT

ఒకరు స్టైలిష్ పెర్ఫార్మెన్స్‌ తో పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో.. మరొకరు మాస్ ఎంటర్టైనర్లతో బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ చూపించిన దర్శకుడు. ఆ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే మూవీ లవర్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే క్రేజ్‌ ను సొంతం చేసుకుంటోంది అల్లు అర్జున్- అట్లీ కాంబోలో గ్రాండ్ గా తెరకెక్కుతున్న రాకా మూవీ.

అల్లు అర్జున్ నటిస్తున్న ఆ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉండగా.. కొన్ని నెలలుగా హాట్ టాపిక్ గానే కొనసాగుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో బన్నీకి పెరిగిన మార్కెట్, అట్లీకి ఉన్న కమర్షియల్ ఇమేజ్ ఆ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. నిజానికి అల్లు అర్జున్ కెరీర్‌ లో పుష్ప సిరీస్ మెయిన్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ముఖ్యంగా పుష్ప 2 విజయంతో బన్నీ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మార్మోగింది.

తెలుగు స్టేట్స్ తోపాటు నార్త్ లో కూడా ఆయనకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బన్నీ స్టైల్, డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాలకు భాషలతో సంబంధం లేకుండా అభిమానులు పెరిగారు. ఇలాంటి సమయంలో వస్తున్న రాకాపై నార్మల్ గానే భారీ ఆసక్తి నెలకొంది. పుష్ప తర్వాత బన్నీ ఎలాంటి కథను ఎంచుకుంటారు? తన ఇమేజ్‌ ను ఇంకా ఎలా పెంచుకుంటారు? అనే ప్రశ్నలకు సమాధానంగా ఆ సినిమా నిలుస్తుందా అనే చర్చ జరుగుతోంది.

మరోవైపు దర్శకుడు అట్లీకి కూడా భారీ చిత్రాలను తెరకెక్కించడంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. స్టార్ హీరోలను అభిమానులకు నచ్చే విధంగా ప్రజెంట్ చేయడం, ఎమోషన్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ను కలిపి సినిమాను రూపొందించడం ఆయన స్టైల్. గతంలో అట్లీ తెరకెక్కించిన చిత్రాలు మాస్ ఆడియన్స్‌ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో అల్లు అర్జున్ లాంటి ఎనర్జిటిక్ హీరోతో ఆయన ఎలాంటి సినిమా రూపొందిస్తున్నారనే ఆసక్తి ఫ్యాన్స్ లో పెరిగింది.

అదే సమయంలో ఏదైనా సినిమా విజయంలో హీరో, దర్శకుడి కాంబినేషన్ కూడా కీలకంగా మారుతుంది. ఒకరి స్త్రెంగ్త్స్ ను మరొకరు ఫుల్ గా యూజ్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ కచ్చితంగా స్క్రీన్ పై కనిపిస్తుంది. బన్నీకి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్‌ కు అట్లీ కమర్షియల్ టేకింగ్ తోడైతే రాకా మూవీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే అవకాశం ఉందని ముందు నుంచి కూడా అంచనాలు వెలువడుతున్నాయి.

అంతేకాదు సినిమా రెండు పార్టులుగా రూపొందే అవకాశం ఉందన్న వార్తలు కూడా అంచనాలను మరింత పెంచుతున్నాయి. దీంతో సినిమా బిజినెస్ పై కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా అల్లు అర్జున్ స్టార్ పవర్.. అట్లీ దర్శకత్వ శైలి.. హై రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్.. ఆ మూడు విషయాలు కలవడంతో రాకా మూవీపై హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే సినిమా విడుదలకు ముందే హాట్ టాపిక్ గా మారిన ఆ ప్రాజెక్ట్, పాన్ ఇండియా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News