స్టార్ వారసుడి తో అజ్ఞాత మహిళ!
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ మీడియాలోనూప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ మీడియాలోనూప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్న ఆర్యన్ ఖాన్ తాజాగా పర్సనల్ లైఫ్ కారణంగా మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చారు. లండన్‌లోని ప్రఖ్యాత కాసినోలో ఆయన కనిపించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా లండన్‌లోని హై-ప్రొఫైల్ కాసినోలో ఆర్యన్ ఖాన్ సందడి చేస్తూ కనిపించారు. అయితే ఆయన ఒక్కడే కాకుండా డానిష్‌కి చెందిన ప్రముఖ సింగర్ విన్నీ టకైర్‌తో కలిసి అక్కడ ప్రత్యక్షమవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇద్దరు కలిసి ఉన్న క్షణాలు కెమెరాకు చిక్కడంతో బాలీవుడ్ సర్కిల్స్‌లో జంటపై కొత్త డేటింగ్ రూమర్స్ జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ ఫొటోలు బయటికి రావడంతో ఇంటర్నెట్‌లో రకరకాల చర్చలు మొదలయ్యాయి.
అసలు ఈ విన్నీ టకైర్ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటనే దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. విన్నీ టకైర్ డెన్మార్క్‌కు చెందిన ప్రతిభావంతురాలైన సింగర్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆమె మ్యూజికల్ టాలెంట్‌తో పాటు గ్లామరస్ లుక్స్‌తో విదేశాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
అలాంటి విదేశీ గాయనితో ఆర్యన్ ఖాన్ లండన్ వీధుల్లో, కాసినోలలో కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకె త్తిస్తోంది. గతంలోనూ ఆర్యన్ ఖాన్ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా విన్నీ టకైర్‌తో ఆర్యన్ ఖాన్ పేరు ముడిపడటంతో వార్తలు మరింత బలపడ్డాయి. అయితే ఇద్దరి మధ్య స్నేహబంధం మాత్రమే ఉందా? దీని వెనుక ఏదైనా రిలేషన్‌షిప్ ఉందా? అనే దానిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. అయినా? ఈ రూమర్స్ మాత్రం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టారు. త్వరలోనే ఆర్యన్ ఓ పెద్ద సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. నిర్మాణ రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్న ఆర్యన్ ఖాన్ వ్యక్తిగత విషయాలను మాత్రం ఎప్పుడూ గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రముఖులతో ఆయనకుండే పరిచయాలు మాత్రం తరచూ మీడియా కంట పడుతుంటాయి. ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఉంటేనే ఈ రేంజ్ లో హైలైట్ అవుతున్నాడంటే? ఒక్కసారి ముఖానికి మ్యాకప్ వేసుకుని తెర మీద కనిపిస్తే? ఆ లెక్క వెరే లెవల్లో ఉంటుంది. ఆర్యన్ అందానికి ఫిదా కానీ బ్యూటీ ఉండదు. తెరపైకి రాని ఎఫైర్లు ఉండవు. బాలీవుడ్ అంటే ఎఫైర్లకు పెట్టింది పేరుగాంచింది. ఆర్యన్ ఖాన్ పేరు ఇలాంటి విషయాల్లో మరింత సంచలనం అవ్వడానికి అవకాశాలు అంతే ఎక్కువగా ఉంటాయి.