మెగా ప్రిన్స్ లో అన్నీ డాడీ లక్షణాలే!
ఈ క్రమంలోనే నాగబాబు ఆహారపు అలవాట్లకు సంబంధించి చెప్పిన కొన్ని ముచ్చట్లు అప్పట్లో బాగా హైలైట్ అయ్యాయి.
సెలబ్రిటీల సినిమా విశేషాల కంటే? వ్యక్తిగత విషయాలు, చిన్ననాటి జ్ఞాపకాలే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అందులోనూ మెగా ఫ్యామిలీ విశేషాలు అంటే మరింత క్యూరియాసిటీని కలిగిస్తాయి. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబుల గురించి వారి తల్లి అంజనా దేవి గతంలో పలు సందర్భాల్లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు ఆహారపు అలవాట్లకు సంబంధించి చెప్పిన కొన్ని ముచ్చట్లు అప్పట్లో బాగా హైలైట్ అయ్యాయి. మెగా కుటుంబంలో పెద్దవాడైన చిరంజీవి ఏది వండి పెట్టినా ఎప్పుడూ కాదనకుండా ఇష్టంగా తినేవారని.. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నంతలో సర్దుకుపోయేవారని తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఇది కావాలి.. అది కావాలి అని మారం చేసేవారు కాదన్నారు. కానీ నాగబాబు విషయంలో మాత్రం పరిస్థితి కొద్దిగా భిన్నంగా ఉండేదన్నారు. నాగబాబు కు భోజనంలో నాన్-వెజ్ లేకపోతే ముద్ద దిగేది కాదని అంజనా దేవి సరదాగా గుర్తు చేసుకున్నారు. నాగబాబుకు చిన్నతనం నుంచి మాంసాహారం అమితమైన ఇష్టమని, నాన్-వెజ్ వంటకాలు ఉంటేనే ఆయన కడుపు నిండేదని అంజనా దేవి వెల్లడించారు. ఇంట్లో నాన్-వెజ్ వంటకం లేకపోతే నాగబాబు సరిగ్గా తినేవారు కాదని.. భోజనం విషయంలో కాస్త మారం చేసేవారని తెలిపారు.
ఆ కుటుంబంలో మిగతా వారందరూ నిరాడంబరంగా సర్దుకుపోతుంటే? నాగబాబు మాత్రం ఈ విషయంలో కాస్త ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే? సరిగ్గా అవే లక్షణాలు ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. వరుణ్ తేజ్ లో నాగబాబు పోలికలు, హావభావాలు మాత్రమే కాకుండా ఆహారపు అలవాట్లలోనూ వరుణ్ తేజ్ అచ్చం తండ్రినే పోలి ఉంటారట. వరుణ్ తేజ్‌కు కూడా భోజనంలో నాన్-వెజ్ లేకపోతే ఆ మీల్ ఎప్పటికీ సంపూర్ణంగా తోచదట. ముక్క లేనిదే ముద్ద దిగదల. నాన్ -వెజ్ ప్రియుడిగా వరుణ్ తేజ్ తండ్రి బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తుంది.
చిన్నతనంలో నాగబాబు ఎలా మారం చేసేవారో? వరుణ్ తేజ్ కూడా అలాగే ఇష్టమైన వాటి కోసం అలిగిన రోజులు ఉన్నాయని అంటున్నారు. నచ్చిన వంటకం టేబుల్ మీద లేకపోతే చిన్నపిల్లాడిలా అలకబూనుతారట. ఆ సమయంలో ఇంట్లో ఉండే వాళ్లందరూ ఆయనను బుజ్జగించాల్సి వస్తుందని.. ఇలాంటి సరదా సంఘటనలు మెగా ఇంటిలో చిన్నప్పుడు తరుచూ జరిగేవని తెలుస్తోంది. అలా తండ్రి పోలికలు రూపంలోనే కాకుండా ఇలాంటి చిన్నచిన్న అలవాట్లలో కూడా రావడం విశేషం.
నాగబాబు పోకడలు అచ్చం వరుణ్‌లో ప్రతిబింబించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. తెరపై ఎంత హుందాగా, స్టైలిష్‌గా కనిపించినా, ఇంటిలో మాత్రం వారు ఎంతో సాధారణమైన కుటుంబ సభ్యుల్లాగే గడుపు తారనడానికి ఈ ముచ్చట్లే నిదర్శనం. నాన్ వెజ్ పట్ల వారికుండే చిన్నపాటి ఇష్టాలు, అలకలు మెగా ఇంటి వాతా వరణాన్ని మరింత ఆప్యాయంగా మారుస్తున్నాయి.