సినిమాలో పాత్ర కోసం భారీ ప్రయోగం చేసిన టాప్-5 సౌత్ స్టార్లు
`పెద్ది` కోసం చరణ్, `మహావతార్` కోసం విక్కీ కౌశల్ బరువు పెరిగారు. ఇటీవల సినిమాలో పాత్ర కోసం బరువు పెరిగిన లేదా తగ్గిన టాప్ -5 స్టార్ల వివరాలు పరిశీలిస్తే ఆసక్తిని రేకెత్తిస్తాయి.
`పెద్ది` కోసం చరణ్, `మహావతార్` కోసం విక్కీ కౌశల్ బరువు పెరిగారు. ఇటీవల సినిమాలో పాత్ర కోసం బరువు పెరిగిన లేదా తగ్గిన టాప్ -5 స్టార్ల వివరాలు పరిశీలిస్తే ఆసక్తిని రేకెత్తిస్తాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ సినీపరిశ్రమల్లో 2026వ సంవత్సరంలో బరువు పెరిగిన లేదా తగ్గిన స్టార్ల వివరాలు... ఏ పాత్రల కోసం అంటే..? పూర్తి వివరాల్లోకి వెళ్లాలి.
సినీ ఇండస్ట్రీలో ఒక పాత్రలో ఒదిగిపోవడానికి నటీనటులు పడే శ్రమ సాధారణమైనది కాదు. కేవలం నటనతోనే కాకుండా, తమ శారీరక రూపాన్ని కూడా పాత్రకు తగినట్లుగా మలచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుంటారు. 2026లో తమ సినిమాల కోసం శరీర బరువును పెంచి లేదా తగ్గించి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించిన భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని టాప్-5 స్టార్లను ఎంపిక చేస్తే.. వీరంతా ఆయా పాత్రల కోసం పడిన శ్రమ అసాధారణమైనది.
రామ్ చరణ్ -`పెద్ది` (తెలుగు)
`ఉప్పెన` ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా `పెద్ది` కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఊరమాస్, రగ్గడ్ రోల్ కోసం చరణ్ దాదాపు 10 నుండి 15 కిలోల బరువు పెరిగి, కండలు తిరిగిన దేహంతో కనిపించారు. చరణ్ ఇందులో క్రీడాకారుడిగా అద్భుత నటప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం దాదాపు 350 కోట్లు వసూలు చేసింది.
విక్కీ కౌశల్ -మహావతార్ (హిందీ)
అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కతున్న `మహావతార్` అనే భారీ పౌరాణిక యాక్షన్ చిత్రంలో విక్కీ కౌశల్ చిరంజీవి పరశురాముడి పాత్రను పోషిస్తున్నారు. ఈ శక్తివంతమైన పాత్ర ప్రతిరూపంగా కనిపించడం కోసం విక్కీ కౌశల్ భారీగా బరువు పెరిగి, కఠినమైన జిమ్ వర్కౌట్లు- హెవీ వెయిట్ ట్రైనింగ్ ద్వారా యోధాలాంటి శరీరాకృతిని సంతరించుకున్నారు. దీనికోసం చావా ఫిట్ నెస్ ట్రైనర్ ని మరోసారి బరిలోకి దించారు. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన అప్ డేట్ అందాల్సి ఉంది.
సూర్య - సూర్య 44, కంగువ తదనంతర ప్రాజెక్ట్‌లు (తమిళం)
తమిళ స్టార్ హీరో సూర్య తన పాత్రల కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా వెనుకాడరు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమా కోసం సూర్య తన పాత గ్యాంగ్‌స్టర్ - యాక్షన్ షేడ్స్‌కు భిన్నంగా చాలా స్లిమ్‌గా, లీన్‌గా మారడానికి బరువు తగ్గారు. ఈ పాత్రలో యంగ్ , షార్ప్ లుక్‌లో కనిపించడానికి ఆయన ప్రత్యేకమైన డైట్ ఫాలో అయ్యారు. తన కెరీర్ లో శివపుత్రుడు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ సహా చాలా సినిమాల కోసం సూర్య తన రూపాన్ని మార్చుకోవడానికి చాలా శ్రమించారు.
టోవినో థామస్ -ఐడెంటిటీ , కొత్త ప్రాజెక్ట్ (మలయాళం)
మలయాళ చిత్రసీమలో ప్రయోగాలకు పేరుగాంచిన నటుడు టోవినో థామస్. తన తాజా యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ కోసం అతడు తన శరీరంలో కొవ్వు శాతాన్ని పూర్తిగా తగ్గించి అత్యంత ఫిట్‌గా, కట్‌లతో కూడిన ష్రెడెడ్ అవతారంలోకి మారారు. యాక్షన్ సీక్వెన్స్‌లు సహజంగా రావడానికి ఆయన ఈ ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ చేసుకున్నారు. దీనికోసం అతడు కొంత బరువు తగ్గాడు.
ధృవ సర్జా -కెడి : ది డెవిల్ (కన్నడ)
కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా `కేడి- ది డెవిల్` సినిమా కోసం రెండు వేర్వేరు గెటప్స్ ని వేసారు. వీటి కోసం భారీగా శ్రమించారు. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా కావడంతో ఒక షెడ్యూల్ కోసం ఏకంగా 18-20 కిలోల బరువు పెరిగి మాస్ క్యారెక్టర్‌లో కనిపించగా... మరో షెడ్యూల్ యంగ్ లుక్ కోసం అంతే వేగంగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కి చాలా గొప్ప పేరొచ్చింది. ధృవ సర్జా కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ తో అలరించారని టాక్ వచ్చింది.