• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందుకే బాసూ మనం యాక్టింగ్...

అందుకే బాసూ మనం యాక్టింగ్ వైపు వెళ్లలేదు: అల్లు బాబీ

By - Tupaki Desk
Update: 2022-03-31 03:30 GMT
సాధారణంగా ఎక్కడైనా ఒక సినిమా ఫంక్షన్ జరుగుతుంటేనే అందుకు సంబంధించిన ఫొటోల్లో పడాలనే ఆరాటాన్ని చాలా మంది ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటిది వెండితెరపై కనిపించే అవకాశం వస్తే వదులుకుంటారా? స్టార్ డమ్ లు ..  పారితోషికాలు పక్కన పెడితే, తెరపై అసలు మనం ఎలా కనిపిస్తామనేది చూసుకోవాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ఇక ఏదైనా సినిమాలో చిన్నపాత్ర వేస్తే .. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎవరైనా సరే గుర్తుపట్టి 'సార్ .. ఓ సెల్ఫీ' అంటే అప్పుడు కలిగే ఆనందానికి హద్దులు ఉండవు.

ఎంత డబ్బు ఉన్నప్పటికీ .. నలుగురిలోకి వెళ్లినప్పుడు ఒకసారి చూసేసి ఊర్కుంటారు. అదే  సినిమా స్టార్ అయితే దగ్గరికి పరిగెత్తుకు వస్తారు. క్రేజ్ ఎక్కువగా ఉంటే ఒకరిని ఒకరు తోసుకుంటూ మీదపడిపోతారు. అలాంటి ఒక క్రేజ్ కోసమే ఇండస్ట్రీకి చాలామంది వస్తుంటారు. అవకాశాల కోసం అదే పనిగా తిరుగుతుంటారు.  చిన్న వేషమైనా ఫరవాలేదు సార్ అంటారు .. అలాంటి ఒక ఛాన్స్ కోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తారు. కానీ అన్ని రకాల అవకాశాలు ఉండి కూడా .. తెరపై కనిపించడానికి ఎలాంటి ప్రయత్నం చేయనివారిని చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమే కలుగుతుంది.

అల్లు బాబీని చూసినప్పుడు కూడా అలాంటి ఆశ్చర్యమే కలుగుతుంది. నిర్మాతగా అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా  చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన వారసుడిగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇక అల్లు శిరీష్ కూడా నిదానమే ప్రధానమన్నట్టుగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. కానీ అల్లు బాబీ మాత్రం నటన వైపు ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. సరదాగా కూడా అలాంటి ఒక ఆలోచన చేయలేదు. నిర్మాణ పరమైన పనులను మాత్రమే చూసుకుంటూ వస్తున్న ఆయనకి, తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది.

" కొంతకాలం క్రితం వరకూ కూడా నటనవైపుకు రమ్మంటూ నాకు అవకాశాలు వచ్చాయి. కానీ నేను వాటిని సున్నితంగానే తిరస్కరించాను. కేరక్టర్ ఆర్టిస్టుగా చేసినా మంచి పారితోషికాలు ఉన్నాయి. అయినా నేను ఆ వైపుకు వెళ్లలేదు. నటన వైపుకు వెళితే ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. అందువలన వాళ్లు బయట స్వేచ్ఛగా తిరగలేరు.

ఈ విశాలమైన ప్రపంచంలో నేను ఎక్కడికైనా .. ఎప్పుడైనా వెళ్లాలి .. స్వేచ్ఛగా తిరగాలి. ఆ స్వేచ్ఛను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే  అవకాశం ఉన్నప్పటికీ నేను ఎప్పుడూ నటన వైపుకు వెళ్లలేదు" అని చెప్పుకొచ్చాడు. ఆయన నిర్మించిన  'గని' సినిమా, ఏప్రిల్ 8వ తేదీన విడుదల కానున్న  సంగతి తెలిసిందే.
Tags:    
  • Allu Bobby 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS