గ్లోబల్ బ్యూటీ అధర గ్లామరసం.. అదిరిందిగా!
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలియని గ్లామర్ ప్రియులు ఉండరు. ఎందుకంటే ప్రియాంక ఇండియాతో పాటు హాలీవుడ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయింది. బాలీవుడ్ హీరోయిన్ గా సెటిల్ అయిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ సినిమాలతో గ్లోబల్ బ్యూటీగా ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ భామ ఇండియన్ సినిమాలలో కనిపించి కొన్నేళ్లు గడిచింది. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ తో పెళ్లయ్యాక న్యూయార్క్ నగరంలో సెటిల్ అయింది. హాలీవుడ్ లో అడుగుపెట్టాక ప్రియాంక పూర్తిగా ఖాళీ లేకుండా బిజీ అయిపోయింది. ఎల్లప్పుడూ ఏదొక ఫోటోషూట్ లేదా మూవీ షూటింగ్ అంటూ తన జీవితంలో నుండి ఖాళీ అనే పదానికి ఛాన్స్ ఇవ్వడం లేదట. ఇన్నేళ్ల భారీ గ్యాప్ తర్వాత బాలీవుడ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్ తో 'ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్' అనే హాలీవుడ్ మూవీలో నటించింది అమ్మడు.
ప్రస్తుతం తన చేతిలో అన్ని హాలీవుడ్ వెబ్ సిరీస్ లు, సినిమాలే ఉన్నాయట. ఇండియాలో పుట్టిపెరిగిన అమ్మడికి ఇప్పుడు ఇండియాకి వచ్చేంత టైం దొరకట్లేదని టాక్. పెళ్లికి ముందు సినిమాలతో, ఫోటోషూట్స్ తో కెమెరా ముందు ఎలా చెలరేగిందో.. పెళ్లి తర్వాత కూడా అదే రేంజిలో రెచ్చిపోతుంది. ఏదేమైనా అభిమానులకు సమయానికి గ్లామర్ కిక్ ఇవ్వాలంటే ప్రియాంకనే అనేలా మారింది. ఎందుకంటే ఫోటోషూట్స్ తో అందాలను గుప్పించడం అమ్మడికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రియాంక లేటెస్ట్ ఫోటో పోస్ట్ చేసింది. అందులో అమ్మడి హెయిర్ స్టయిల్, లిప్స్ చూస్తూ ఫిదా అవుతున్నారు ఫాలోయర్స్. ప్రియాంకకు సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఈ ఫోటోలో నా ముఖాన్ని హెయిర్ 60% కవర్ చేస్తే.. నా లిప్స్ 40% కవర్ చేశాయంటూ కాప్షన్ జోడించింది. అవును హెయిర్ స్టైల్ ఏమోగానీ లిప్స్ మాత్రం ఊరిస్తున్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.