'విరాటపర్వం'లో జాతీయ అవార్డు నటి
'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'విరాటపర్వం'. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటివరకు 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట. ఈ సినిమాలో హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫన్ రిచ్టర్ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ కానున్నాయట. ఇక ఈ చిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్గా నటిస్తుండగా - సాయిపల్లవి నక్సలైట్ గా కనిపించనుంది. వీరితో పాటు నేషనల్ అవార్డు గ్రహీత ప్రియమణి కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో తన పాత్ర గురించి ప్రియమణి మాట్లాడుతూ.. నక్సలైట్ గా నటిస్తున్నట్లు వెల్లడించింది. సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు ప్రియమణి.. విక్టరీ వెంకటేష్ నటిస్తున్న నారప్పలో ఆయన భార్యగా నటిస్తున్నట్లు తెలిపింది. ఈ సినిమా కోలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ మూవీ 'అసురన్'కు రీమేక్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతుంది. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా లేకుంటే ఈపాటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అవుతుండేదట. ఆగస్టు లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.