కమెడియన్ చెప్పిన సెంటిమెంట్ డైలాగ్స్

Update: 2017-04-30 10:22 GMT
పెళ్లిచూపులు మూవీలో కమెడియన్ ప్రియదర్శి చేసిన కామెడీకి విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. ఆ మూవీ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న ప్రియదర్శి.. ఆ తర్వాత సినిమాల ఎంపికలో కేర్ ఫుల్ గా ఉన్నాడు. ప్రస్తుతం హంటర్ మూవీకి రీమేక్ గా బాబు బాగా బిజీలో నటించాడు ప్రియదర్శి.

'పెళ్లి చూపులు తర్వాత ఏ సినిమా చేయాలని బాగా ఆలోచించాను. హంటర్ మూవీ రీమేక్ లో చేయమన్నపుడు.. పెద్దగా ఆలోచించలేదు. కానీ హంటర్ ఓ హానెస్ట్ మూవీ. అలాంటి ప్రయత్నం చేస్తారా.. అలాగే తీస్తారా అని దర్శకుడిని అడిగాను. కానీ నేను ఆశించిన స్థాయి కంటే బాగా తీశారు. ఈ సినిమా ద్వారా నాకు నచ్చిన మరో అద్భుత అవకాశం తనికెళ్ల భరణితో నటించడం. ఆయన్ను చూస్తూ పెరిగిన నాకు.. ఆయనతో కలిసి నటించడం.. ఆయన ఎదురుగుండా మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం' అన్నాడు ప్రియదర్శి.

'ఈ మూవీలో చేసిన ముగ్గురు అమ్మాయిల కేరక్టర్లు అద్భుతం. అలాంటి పాత్రలు సమాజంలో ఉంటాయి కానీ.. వాటిలో నటించేందుకు చాలా మంది ఒప్పుకోరు. కానీ వాళ్లు ధైర్యంగా చేసినందుకు హ్యాట్సాఫ్. ఈ చిత్రంలో తెలంగాణ యాసతో కాకుండా.. కేరక్టర్ కి తగినట్లుగా కావాలన్నారు.. అలాగే చేశాను. సినిమా సక్సెస్ తో నాకు సంబంధం లేదు కానీ.. హిట్ అవుతుందని ఆశిస్తున్నాను' అన్నాడు ప్రియదర్శి

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News