ప్రభాస్... ప్రిన్స్ లా థ్యాంక్స్ చెప్పొచ్చుగా!
తన సినిమాకి వంద కోట్లు వచ్చాయని మహేష్ బాబు చాలా ఎక్సైట్ అవుతున్నాడు. అందుకోసం ప్రేక్షకులకి ఎన్నిసార్లు కృతజ్జతలు చెప్పాడో లెక్కేలేదు. ప్రెస్ మీట్లు పెట్టాడు, ఇంటర్వూ లు ఇచ్చాడు. వాటి ద్వారానే ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు. అయినా ఆయనకి తనివి తీరలేదు. మళ్లీ అభిమానుల కోసం నిన్న హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ ని ఏర్పాటు చేసి మరీ కృతజ్జతలు చెప్పుకొన్నాడు. సినిమా విడుదలయ్యాక మహేష్ ఇంత హడావుడి చేయడం ఇదే తొలిసారి. నిజానికి మహేష్ కి సూపర్ హిట్లు రావడం కొత్తేమీ కాదు. కానీ `శ్రీమంతుడు`లాంటి సినిమాని అభిమానులు ఆదరించడం మహేష్ ని మిక్కిలి సంతోషపెట్టింది. అయితే ప్రభాస్‌కి మహేష్ కంటే గొప్ప విజయం దక్కింది. `బాహుబలి`తో ఒక్కసారిగా నాలుగైదు భాషల్లో పాపులర్ అయ్యాడు. మహేష్ సినిమాకి కలెక్షన్లు వంద కోట్లే. కానీ ప్రభాస్ సినిమాకి దరిదాపుగా రూః500కోట్లు వచ్చాయి. ఆ లెక్కన ఆయన అభిమానులకి ఎన్నిసార్లు కృతజ్జతలు చెప్పుకోవాలో.
కానీ డార్లింగ్ సినిమాకి ముందు హడావుడి చేశాడు కానీ... సినిమా తర్వాత అడ్రస్ లేకుండా వెళ్లిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా అభిమానులకి తెలీదు. నిజానికి `బాహుబలి`లాంటి భారీ సినిమా వచ్చాక, అది గ్రాండ్ గా సక్సెస్ అయ్యాక సక్సెస్ మీట్ టైప్ లో ఏదైనా భారీ వేడుక జరపాలి. అప్పుడే ఆ సినిమాకి పరిపూర్ణత దక్కినట్టు భావిస్తుంటాయి పరిశ్రమ వర్గాలు. మరి `బాహుబలి` టీమ్ వచ్చిన వసూళ్లని లెక్కబెట్టుకొనే పనిలోనే బిజీ అయిపోయిందో ఏంటో సక్సెస్ సంబరాలు అస్సలు జరపలేదు. ప్రభాస్ కేవలం మీడియాకి మాత్రమే గెట్ టు గెదర్ ఏర్పాటు చేశాడు. దానికి కూడా ఆయన స్వయంగా హాజరు కాలేదు. నిన్న జరిగిన మహేష్ థ్యాంక్స్ మీట్ చూశాక... డార్లింగ్ ప్రభాస్ అభిమానులు `మా హీరో కూడా ఇలాంటి ఓ ఫంక్షన్ ఏర్పాటు చేసుంటే బాగుండేది` అని మాట్లాడుకొంటున్నారు. మరి ఆ విషయంలో ప్రభాస్ అభిప్రాయమేంటో!!