OTT లో ఆదిపురుష్ ముందస్తు విడుదల?
ప్రభాస్- కృతి సనన్- సైఫ్ ఖాన్ ప్రధాన తారాగణంగా నటించిన ఆదిపురుష్ గత నెలలో విడుదలైంది. ఓం రౌత్ సినిమా అభిమానులు విమర్శకులపై ఎలాటి ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా రకరకాల కోణాల్లో విమర్శల పాలైంది. అయినా పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం భారీ ఓపెనింగులు సాధించింది. ఫ్లాప్ టాక్ తెచ్చుకుని దాదాపు 280కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం.
ఈ చిత్రం OTT విడుదల తేదీపై ఇటీవల రకరకాల ఊహాగానాల కారణంగా హెడ్ లైన్స్ లోకొస్తోంది. OTT ప్లాట్ ఫారమ్ లలో ముందస్తు డిజిటల్ విడుదల గురించి విస్తృతమైన ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రూమర్స్ కు బ్రేక్ పడింది. ఆదిపురుష్ సినిమా సన్నిహిత వర్గాలు ఈ చిత్రం డిజిటల్ అరంగేట్రం విషయంలో ప్రారంభ ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదని ధృవీకరించాయి. `ఆదిపురుష్` తొలుత ప్రకటించిన అసలు విడుదల షెడ్యూల్ మారదు. అనుకున్న ప్రకారం OTT ప్లాట్ ఫారమ్ లలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమా హిందీ- తమిళం- తెలుగు- కన్నడ- మలయాళం భాషల్లో ఓటీటీలోను విడుదల కానుంది. ఆదిపురుష్ OTT ప్లాట్ ఫారమ్ లలో ప్రీమియర్ అయినప్పుడు ప్రత్యేకంగా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనుందని సమాచారం. మొదట్లో ఈ మూవీ నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ వీడియోకి హక్కులు విక్రయించారని పుకార్లు వచ్చాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 250 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రామాయణం కి మోడ్రన్ వెర్షన్. ఇందులో ప్రభాస్ రాఘవ పాత్రను .. కృతి సనన్ జానకి పాత్రను పోషించారు. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించగా.. సన్నీ సింగ్ లక్ష్మణునిగా.. దేవ్ దత్తా నాగే హనుమంతుడిగా నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్- క్రిషన్ కుమార్- ఓం రౌత్- ప్రసాద్ సుతార్- రాజేష్ నాయర్ నిర్మించారు. దాదాపు రూ.450-500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఆదిపురుష్ ఇప్పటికీ భారతదేశంలో రూ.300 కోట్ల మార్కుకు దూరంగా ఉంది. ఇది బాక్సాఫీస్ వద్ద దాదాపు 282.33 కోట్లను ఇప్పటికే వసూలు చేయగలిగింది. దీని వలన నిర్మాతలు రూ. 200 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొంటున్నారని సమాచారం.
బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ మిశ్రమ ప్రదర్శన వెనుక ప్రధాన కారణం వరుస వివాదాలే. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో తీవ్ర విమర్శలొచ్చాయి. బజరంగబలి పాత్ర లంక దహన్ సన్నివేశంలో అభ్యంతరకర డైలాగుల కారణంగా ప్రేక్షకులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. అయితే మేకర్స్ సమస్యను పరిష్కరించారు. కొత్త ప్రింట్ లలో బాప్ పదాన్ని లంక తో భర్తీ చేసి అవసరమైన మార్పులు చేశారు. ఇటీవల అలహాబాద్ హైకోర్టు రామాయణాన్ని వక్రీకరించినందుకు చిత్ర నిర్మాతలను విమర్శించింది. సినిమా సర్టిఫికేట్ ను రద్దు చేసే అవకాశం గురించి సెన్సార్ బోర్డును ప్రశ్నించింది.