టాలీవుడ్ నుంచి ఓకే ఒక్కడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయి.. విమర్శలు, వివాదాల్లో చిక్కుకుంది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ.. ఇందులోని పాత్రల ఆహార్యం, గ్రాఫిక్స్, డైలాగులు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. తాజాగా చిత్ర బృందం హనుమాన్ డైలాగ్ ల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించారు. సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించాడు. ఈ సినిమాలో రావణుడి ఆహార్యం మీద వివాదాలు విమర్శలు తలెత్తాయి. రావణుడి తలల అమరికపై కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. ఈ సినిమా ఇప్పటికీ ట్రోలింగ్ కు గురువుతోంది.
అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు కలెక్షన్లు బాగానే రాబట్టింది. దాదాపు 400 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఈ సినిమాతో ఓ అరుదైన ఘనత సాధించాడు. అది ఏంటంటే... యూఎస్ఏలో 3 మిలియన్ డాలర్ల మార్కును అందుకున్న సినిమాల్లో ప్రభాస్ సినిమాలే 4 ఉన్నాయి.
యూఎస్ఏలో ఇప్పటివరకు మూడు మిలియన్ల డాలర్ మార్కును అందుకున్న సినిమాల్లో ప్రభాస్ ఆదిపురుష్ ఉంది. ఈ సినిమాతో ఆయన ఈ మార్కును అందుకున్న చిత్రాలు నాలుగు. బాహుబలి, బాహుబలి 2, సాహో తర్వాత ఇప్పుడు ఆదిపురుష్ వచ్చి చేరింది. టాలీవుడ్ నుంచి ప్రభాస్ సినిమాలే నాలుగు నిలిచాయి. రామ్ చరణ్ సినిమాలు రెండు ఉండగా.. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబుల సినిమాలు ఒక్కో సినిమా నిలిచింది.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి జై శ్రీరామ్ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. అయితే దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని తనకు నచ్చినట్లు చిత్రీకరించారని విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాను 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్, టి సిరీస్, రెట్రో ఫైల్స్ నిర్మించాయి.