'పవర్ స్టార్' ట్రైలర్ లీక్ పబ్లిసిటీలో భాగమేనా...?
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సినిమాలకు హైప్ తీసుకురావడానికి పబ్లిసిటీ విషయంలో కొత్త కొత్త ఐడియాలతో వస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి ప్రతీదీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఉంటుంది. షూటింగ్ మొదలుకొని విడుదల వరకు ఎక్సట్రా రూపాయి ఖర్చు పెట్టకుండా తానే స్వయంగా సినిమాని పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు. నిజానికి సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో ఏ మేకర్ అయినా వర్మ తర్వాతే అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పబ్లిసిటీ చేస్తూ 'పవర్‌స్టార్' అనే కాంట్రవర్సీ సినిమాను విడుదలకు సిద్ధం చేశారు ఆర్జీవీ. ఈ రోజు ఉదయం 11 గంటలకు 'పవర్ స్టార్' ట్రైలర్ పే పర్ వ్యూ విధానంలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ట్రైలర్ ముందే లీక్ అవడంతో చేసేదేమి లేక రామ్ గోపాల్ వర్మ ఈ మూవీ ట్రైలర్ ఒక గంట ముందే యూట్యూబ్ లో రిలీజ్ చేసాడు. ఇప్పటికి ట్రైలర్ చూడటం కోసం డబ్బులు చెల్లించినవారికి వెనక్కి ఇచ్చేస్తాని ప్రకటించారు.
ఇదిలా ఉండగా 'పవర్ స్టార్' ట్రైలర్ లీక్ అవడం అనేది వర్మ పబ్లిసిటీ స్ట్రాటజీలో భాగంగానే జరిగిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వర్మ పబ్లిసిటీ స్టంట్ లో భాగంగానే ఈ లీకుల వ్యవహారం నడిచిందని.. హైప్ క్రియేట్ చేయడానికి ట్రైలర్ కి డబ్బులు పెట్టాడని.. ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తానని ట్వీట్స్ పెడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ గతంలో ఎన్నో కాంట్రవర్సీ సినిమాలు తెరకెక్కించినప్పుడు రాని ఈ లీకుల సమస్య ఇప్పుడెలా వచ్చిందబ్బా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. నేను ఏది చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తా అని చెప్పుకునే వర్మ తన 'పవర్ స్టార్' సినిమాకు హైప్ తీసుకురావడం కోసమే ఈ లీక్ ట్రిక్ ప్లే చేశాడనే అభిప్రాయం వ్యక్తం చేస్తారు.