పవన్ ఫ్యాన్స్ రచ్చ పీక్స్

Update: 2020-05-11 10:10 GMT
సోషల్ మీడియాలో స్టార్ హీరోలు ఇలా ట్వీట్లు చేస్తే అలా అది వైరల్ అయిపోతుంది.దానికి రీట్వీట్లు, కామెంట్స్, షేర్లు.. అబ్బో బోలెడంతా హంగామా ఉంటుంది. హీరోల హ్యాష్ ట్యాగ్ లపై మిలియన్ల ట్వీట్లు వచ్చిపడుతుంటాయి. కొందరు హీరోల పీఆర్వోలు అయితే డబ్బులు పెట్టి మరీ ఈ ట్విట్టర్ ట్రెండ్స్ ను నిర్వహిస్తారనే ప్రచారం ఉంది.

అయితే అందరిదీ ఒక రూటు.. మన పవన్ కళ్యాణ్ ది మరో రూటూ.. ఆయన సినిమాల్లో స్టార్ హీరో అయినా తన సినిమాల గురించి ప్రెస్ మీట్లలో.. సోషల్ మీడియాలో ఒక్క మాట చెప్పరు. అంతెందుకు.. రాజకీయాల్లో ఫ్లాప్ అయ్యాక మొన్నీ మధ్య సినిమాల్లోకి వచ్చి 2 సినిమాల షూటింగ్ చేస్తున్నాడు. ఆయినా ఆ సినిమాల విషయం అధికారికంగా పవన్ ఇంత వరకు వెళ్లడించలేదు. అవేం సినిమాలు.. ఎక్కడిదాకా వచ్చింది. ఎవరు డైరెక్టర్ ఇలా ఏదీ చెప్పరు.. పవన్ అంతే.. ఆయనకు ప్రజా సేవ గురించి రాజకీయాల గురించి తప్పితే సినిమాల గురించి అస్సలు పట్టదు.. ఇంట్రస్ట్ ఉండదు..

తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా ‘గబ్బర్ సింగ్’ సోమవారంతో 8 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ ఫ్యాన్స్ అప్పుడే మొదలు పెట్టారు. ‘8yearsforgabbarsinghhystiria’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ను పెట్టి రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఈ హ్యాష్ ట్యాగ్ పై 3 మిలియన్ల ట్వీట్లు పడ్డాయి. సోమవారానికి 10 మిలియన్ల ట్వీట్లు పెట్టుకున్నారు. అది ఈజీగా దాటేయడం ఖాయం. ఇలా పవన్ పట్టించుకోకపోయిన ఆయన ఫ్యాన్స్ మాత్రం హీరోపై అభిమానం చాటుకుంటుండడం విశేషంగా మారింది.
Tags:    

Similar News