పవర్ స్టార్ డేట్స్ చాలా కాస్ట్‌లీ గురూ...!

Update: 2020-10-11 01:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రతి ఫిలిం మేకర్ కోరుకుంటాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా పవన్ డేట్స్ ఇస్తానంటే ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వడానికి రెడీగా ప్రొడ్యూసర్స్ చాలా మందే ఉన్నారు. అయితే 25 సినిమాల్లో నటించిన తర్వాత పవన్ కళ్యాణ్.. రాజకీయాల మీద ఫోకస్ పెట్టి సినిమాలకు దూరమయ్యాడు. దీంతో పవన్ పూర్తి జీవితం ప్రజాసేవకే కేటాయిస్తాడని.. ఇకపై సినిమాల్లో నటించడనే కామెంట్స్ వచ్చాయి. అయితే పవన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకోవడమే ఆలస్యం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నారని టాక్. వచ్చే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే వీలైనన్ని ప్రాజెక్ట్స్ చేయాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్.. అడ్వాన్సులు తీసుకుంటూ సినిమాలకు కమిట్ అవుతున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం అధికారికంగా ఐదు సినిమాలు కంఫర్మ్ చేసిన పవన్ కళ్యాణ్.. తాజాగా మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ కి పచ్చజెండా ఊపాడని వార్తలు వస్తున్నాయి. 'వకీల్ సాబ్' సినిమా దాదాపుగా పూర్తి చేసిన పవర్ స్టార్.. క్రిష్ తో ఓ సినిమా - హరీష్ శంకర్ డైరెక్షన్  ఓ ప్రాజెక్ట్ - సురేందర్ రెడ్డితో ఓ మూవీ కమిట్ అయ్యాడు. అలానే బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇలా జెట్ స్పీడ్ తో సినిమాలు ఓకే చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మలయాళ రీమేక్ కి కూడా డేట్స్ ఇవ్వనున్నాడట. అయితే ఈ సినిమాకి 40 నుంచి 45 రోజుల డేట్స్ ఇవ్వనున్న పవర్ స్టార్.. ఇందుకు సుమారు 50 కోట్ల వరకు తీసుకుంటున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అందరు స్టార్ హీరోల్లా లాభాల్లో వాటా కాకుండా పారితోషకం రూపంలోనే తీసుకుంటున్నట్లు వినికిడి. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ పవన్ రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో బాగానే డిస్కస్ చేసుకుంటున్నారు.
Tags:    

Similar News