పవన్ 'పవర్ స్టార్' అవ్వడానికి ఆమె కారణం
పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ పవర్ స్టార్.. జనసేన అధినేత తెలుగు రాష్ట్రాల్లో నే కాకుండా సౌత్ ఇండియాలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒక్కడు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించేందుకు మొదట ఒప్పుకోలేదు. అసలు చదువుపై ఇంట్రెస్ట్ లేక ఏం చేయాలో పాలుపోక ఎప్పుడూ మూడీగా ఉంటున్న సమయంలో వదిన సురేఖ దృష్టి పెట్టింది. అన్నయ్య చిరంజీవి కంటే కూడా అధికంగా వదిన సురేఖ పవన్ గురించి శ్రద్ద పెట్టింది. చదువుపై పవన్ కు ఆసక్తి లేదనే విషయం గుర్తించి సినిమాల్లో నటింపజేసింది.
పవన్ ను ఒప్పించి యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ చేసింది. ఆ తర్వాత చిరంజీవితో పలు మార్లు పవన్ విషయం మాట్లాడి చివరకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా మొదలు పెట్టించింది. వదిన మాట కాదనలేక సినిమాల్లో నటించేందుకు సిద్దం అయిన పవన్ కళ్యాన్ మొదటి సినిమా యావరేజ్ గా నిలిచినా రెండవ సినిమా నుండి సూపర్ హిట్స్ ను అందుకుంటూ వచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో పవన్ ఈ స్థాయిలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ సురేఖ గారికి దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో పవన్ స్వయంగా చెప్పుకొచ్చాడు. తాను సినిమాల్లో నటించేందుకు వదిన కారణం అంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ ఆమెను అమ్మలా భావిస్తానంటూ గతంలో పేర్కొన్నాడు. అందుకే ఈ సమయంలో పవన్ ఫ్యాన్స్ సురేఖ గారికి కృతజ్ఞతలు చెప్పాలంటూ కొందరు ఫ్యాన్స్ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. పవన్ ను పవర్ స్టార్ చేసిన ఘనత సురేఖ గారిదే. నేడు పవన్ పుట్టిన రోజు అవ్వడంతో ఆ విషయం మరోసారి చర్చనీయాంశం అయ్యింది.