పూజా అంత కూల్ గా ఉన్నా మైండ్ లో ఏదో సందిగ్ధ‌త‌!

Update: 2021-07-25 02:30 GMT
ముంబై బ్యూటీ పూజా హెగ్డే హ‌వా గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు చోట్లా పూజాహెగ్దే జోరు కొన‌సాగుతోంది. వ‌రుస‌గా అగ్ర హీరోల చిత్రాల్లో అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ స్టార్ డ‌మ్ ని కొన‌సాగిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఏడాదికి ఐదారు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉండే ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లోనూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది.

ఎప్ప‌టిక‌ప్పుడు  కొత్త ఫోటో షూట్ల‌తోనూ  కుర్ర కారుని హీటెక్కిస్తోంది. లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌రుస‌గా యోగా వీడియోలు..ఫిట్ నెస్ వీడియోలతో విరుచుకుప‌డిన పూజా ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేశారు. త‌న తండ్రి కుక్ గా మారి వండి పెడితుంటే తింటున్న ఫోటోల‌ను పూజా షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి.

తాజాగా పూజా హెగ్దే కొత్త ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. పూజా హెగ్డే న‌గ‌ర వీక్ష‌ణ‌లో సుదీర్ఘాలోచ‌న‌తో క‌నిపిస్తోంది. పూజా స్టైలిష్ రెగ్యుల‌ర్ డ్రెస్సింగ్ సెన్స్ ఎలివేట్ అయ్యింది.. అయితే ఈసారి రెగ్యుల‌ర్ హాట్ లుక్ కి దూరంగా స్టైలిష్ లుక్ లో కూల్ గా ఆక‌ట్టుకుంటోంది. వైట్ క‌ల‌ర్ టాప్...ప‌సుపు వ‌ర్ణం ట్రాక్ ఫ్యాంట్ ని ధ‌రించింది. మ్యాచింగ్  హై హీల్స్ ని ధ‌రించి సిటీ అందాల్ని వీక్షిస్తున్న ఫోటో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. మ‌రి ఇది ముంబై లోకేష‌నా?  హైద‌రాబాద్ లొకేష‌నా? అన్న‌ది పూజానే చెప్పాలి.

పూజా ప్రొఫెష‌న‌ల్ కెరీర్ విష‌యానికి వ‌స్తే .. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న `రాధేశ్యామ్` లో న‌టిస్తోంది. అలాగే అఖిల్ తో `మోస్ట్ ఎలిజిబుల్` బ్యాచిల‌ర్ లో.. అటు మెగాస్టార్ చిరంజీవి- చ‌ర‌ణ్ రేర్ కాంబినేష‌న్ న‌టిస్తున్న `ఆచార్య‌` లోనూ ఒక నాయిక‌గా న‌టిస్తోంది. అలాగే ప‌లు హిందీ.. త‌మిళ్ చిత్రాల్లోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. త‌మిళంలో విజ‌య్ స‌ర‌సన బీస్ట్ లోనూ పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. బాలీవుడ్ లో `స‌ర్క‌స్`.. `భాయిజాన్`  చిత్రాల్లో..  త‌మిళ్ లో విజ‌య్ స‌ర‌స‌న `బీస్ట్` అనే చిత్రంలోనూ న‌టిస్తోంది.

రాధేశ్యామ్ రిలీజ్ ఎపుడు?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా.. పూజా హెగ్దే నాయిక‌గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ `రాధేశ్యామ్` రిలీజ్ ఎప్పుడు?  ప్ర‌స్తుతం అభిమానుల్లో సందిగ్ధ‌మిది. ఈ చిత్రాన్ని తెలుగు- హిందీ భాష‌ల్లో  ఈ చిత్రాన్ని అత్యంత‌ భారీ బ‌డ్జెట్  తో యువీ క్రియేష‌న్స్ సంస్థ‌ నిర్మిస్తోంది. ఇదో పీరియాడిక‌ల్ ప్రేమ క‌థా చిత్రం కాగా.. నాటి కాలమానం ప్ర‌కారం సెట్లలో యాక్ష‌న్ స‌న్నివేశాలు అంతే ఆస‌క్తిక‌రంగాను సాగ‌నున్నాయి.

ప్ర‌త్యేకంగా సెట్లు నిర్మించి కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్ విజువ‌ల్స్ తో  సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక షూటింగ్ కూడా చాలా వ‌రకూ పూర్త‌యింది. సెకెండ్ వేవ్ స‌మ‌యంలో కొంచెం విశ్రాంతి తీసుకున్న‌ప్ప‌టికీ పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులకు స‌మ‌యం కేటాయించి వీలైనంత వ‌ర‌కూ ఆ ప‌నులు పూర్తి చేసారు. తాజాగా సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర అప్ డేట్ ని పూజాహెగ్దే అందించింది.

షూటింగ్ దాదాపు పూర్త‌యింద‌ని ఇంకా కేవ‌లం 10 రోజులు షూటింగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంద‌ని  తెలిపింది. ఇదొక మంచి ల‌వ్ స్టోరీ..ఇలాంటి పాత్ర‌లో న‌టించి చాలా కాల‌మైంద‌ని...కొత్త ఎక్స్ పీరియ‌న్స్ ఇచ్చింద‌ని  పేర్కొంది. అయితే  త‌న పాత్ర రొమాంటిక్ గా ఉంటుంద‌ని..ఇత‌ర విష‌యాలు  మాత్రం ఇప్పుడే చెప్ప‌లేన‌ని చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News