జిగేల్ రాణి బామ్మ చిందులు చూశారా

Update: 2018-03-28 10:26 GMT
రామ్‌ చ‌ర‌ణ్‌ - సుకుమార్ కాంబినేష‌న్‌ లో వ‌స్తున్న ‘రంగ‌స్థ‌లం’ సినిమాలో ఓ ప్ర‌త్యేక గీతంలో పూజా హెగ్దే చిందేసిన విష‌యం తెలిసిందే. ఈ పాట కోసం అమ్మ‌డికి ఏకంగా 50 ల‌క్ష‌లు ఇచ్చార‌ని టాక్‌. నిన్న‌నే విడుద‌లైన ఈ సాంగ్ ప్రోమో యూట్యూబ్‌లో మంచి వ్యూస్ రాబ‌డుతోంది. ఇప్పుడు ఆ పాట‌కి స్వ‌యంగా జిగేల్ రాణి బామ్మ కూడా చిందులు వేసి సంద‌డి చేసింది.

బామ్మ డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన పూజా హెగ్దే... ‘‘మా బామ్మ కొన్నిరోజులుగా అనారోగ్యం కార‌ణంగా ఆసుపత్రిలో ఉంది. అయినా స‌రే నేను చేసిన జిగేల్ రాణి ప్రోమో చూసిన వెంట‌నే ఇలా సంతోషంతో గంతులు వేస్తోంది. ఈ పాట ఆమెకి కొత్త ఎన‌ర్జీని ఇచ్చిన‌ట్టుగా అనిపిస్తోంది. దీని కోస‌మే నేనీ ప‌ని చేశా... ’’ అంటూ కామెంట్ చేసింది. పూజా హెగ్దే బామ్మ వ‌య‌సు 83 సంవ‌త్స‌రాలు. ఈ వ‌య‌సులో కూడా ఆమె చేతే చిందులు వేయించిన ఘ‌న‌త మాత్రం రాక్‌స్టార్ దేవిశ్రీ‌ప్ర‌సాద్‌కే ద‌క్కుతుంది. న‌డుము ఒంపులు ప్ర‌ద‌ర్శిస్తూ, ఈ డిజే భామ చేసిన సంద‌డి, రామ్‌చ‌ర‌ణ్ ఊర మాస్ స్టెప్పులు కూడా బామ్మ‌గారికి బాగానే న‌చ్చేసే ఉంటాయి.

మొన్నీ మ‌ధ్యనే ‘హ‌ర్ట్ ఎటాక్‌’ సుంద‌రి అదా శ‌ర్మ‌ - త‌న భామతో క‌లిసి డ్యాన్సులు చేస్తూన్న‌ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇప్పుడు పూజా హెగ్దే కూడా త‌న బామ్మ‌మీద త‌న‌కున్న ప్రేమ‌ను ఈ వీడియోతో పంచుకుంది. అయితే కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం సీరియ‌స్ కండీష‌న్‌ లో హాస్ప‌టిల్‌ లో ఉన్న బామ్మ‌తో డ్యాన్స్ చేయించి, దాన్ని త‌న సాంగ్‌ ప్ర‌మోష‌న్ కోసం వాడుకోవ‌డం స‌రికాదంటూ కామెంట్లు చేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News