గతంలో చాలా మంది నటీనటులు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని వారి దుస్తుల ఎంపిక నడవడిక సముచితంగా లేవని ఫిర్యాదులు దాఖలైన సందర్భాలున్నాయి. మత గురువుల నుంచి రాజకీయ నాయకుల నుండి అనేక సందర్భాల్లో తారలు హెచ్చరికలను ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు అమీర్ ఖాన్.. కమల్ హాసన్.. రణవీర్ సింగ్ నగ్నఫోటోషూట్ ల ప్రకంపనాల గురించి తెలిసిందే. నేహా ధూపియా- లారా దత్తా- కంగన సహా చాలా మంది అందాల కథానాయికలు బోల్డ్ గా అందాలను అరబోసిన ప్రతిసారీ ఏదో ఒక వివాదం చెలరేగింది. సెలబ్రిటీల్లో సెన్సేషనలిజం యాటిట్యూడ్ ని తప్పు పడుతూ మహిళా సంఘాల్లో నిరసనలు వ్యక్తమైన సందర్భాలున్నాయి.
ఈసారి అదే విధంగా ఆరోపణలు ఎదుర్కొంది తాప్సీ పన్ను. ముంబై- లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ లో తాప్సీ టూమచ్ బోల్డ్ లుక్ లో కనిపించడం వివాదానికి దారితీసింది. హింద్ రక్షక్ సంఘటన్ సభ్యుడు .. బిజెపి ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య సింగ్ తాప్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాప్సీ మెడలోని భారీ లాకెట్ లో లక్ష్మీ దేవి విగ్రహంతో ఆలయాన్ని తలపించే ఆభరణాల అలంకరణతో కనిపించిన తాప్సీ పన్ను ఘాటుగా అందాలు ఆరబోసిందని సింగ్ ఫిర్యాదులో ఆరోపించారు.
తాప్సీపై నమోదైన ఫిర్యాదు గురించి ఓ పోలీస్ అధికారి మీడియాతో ఉటంకిస్తూ-``మతపరమైన మనోభావాలు భారతీయ సనాతన ధర్మ ప్రతిష్టను దెబ్బతీసినందుకు నటి తాప్సీ పన్నుపై ఏకలవ్య గౌర్ (బీజేపీ ఎమ్మెల్యే మాలిని గౌర్ కుమారుడు) నుండి మాకు ఫిర్యాదు అందింది`` అని తెలిపారు మార్చి 12న ముంబై- లాక్మే ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ లో ఇలా టూమచ్ రివీలింగ్ డ్రెస్ తో `లక్ష్మీదేవి` ఉన్న లాకెట్ ను ధరించడంపై ఫిర్యాదు అందిందని ప్రస్తుతం విచారణ సాగుతోందని అధికారి తెలిపారు.
తాప్సీ పన్ను అందమైన ఎరుపు రంగు గౌనులో లక్ష్మీదేవి విగ్రహంతో రూపొందించిన లాకెట్ అలంకారాలతో ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై నడిచింది. ఎంపిక చేసిన గౌన్ నెక్ లైన్ టూ బోల్డ్ అప్పియరెన్స్ తో ఎద అందాల ఎలివేషన్ తో మతులు చెడే ట్రీట్ ని ఇచ్చింది. ముఖ్యంగా లక్ష్మీ దేవి విగ్రహాన్ని కలిగి ఉన్న స్టేట్ మెంట్ నెక్ పీస్ తో టూమచ్ మోడ్రనైజ్డ్ దుస్తులను ధరించడం సరికాదని సింగ్ ఆరోపిస్తున్నారు. ఈ లుక్ ని మోనిషా జైసింగ్ రూపొందించగా.. రిలయన్స్ జ్యువెల్స్ కి తాప్సీ షోస్టాపర్ గా మారింది.
తాప్సీ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి `హసీన్ దిల్రూబా 2`లో నటించేందుకు సిద్ధమవుతోంది. అలాగే మోస్ట్ అవైటెడ్ `డుంకీ`లోను నటిస్తోంది. అక్కడ ఆమె మొదటిసారిగా సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలిసి కనిపించనుంది. రాజ్‌కుమార్ హిరాణీ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. వలసదారుల వెతల నేపథ్యంలో ఆద్యంతం ఉద్వేగం రేకెత్తించే చిత్రమిదని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.