పిక్ టాక్: తేజ సజ్జా సూపర్ కూల్ అండ్ స్టైలిష్ మేకోవర్..!
ఓ బేబీ' సినిమాతో రీ ఎంట్రీ తేజ సజ్జా.. 'జోంబీ రెడ్డి' చిత్రంతో హీరోగా సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయ్యాడు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన తేజ.. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఇటీవల 'ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుస సినిమాలను లైన్ లో పెడుతూ దూకుడు మీదున్న యంగ్ హీరో.. తన సూపర్ స్టైలిష్ మేకోవర్ తో ఆశ్చర్యపరుస్తున్నాడు.
తాజాగా తేజ సజ్జా సోషల్ మీడియా మధ్యమాలలో లేటెస్ట్ ఫోటో షూట్స్ కు సంబంధించిన కొన్ని ఫోటోలని షేర్ చేశాడు. ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ఉన్న యువ హీరో.. స్టైలిష్ గా ఓ చైర్ మీద కూర్చున్నాడు. ఇందులో తేజ ఉబర్ కూల్ మేకోవర్ తో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. ఈ పోజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. తేజ సజ్జా ప్రస్తుతం శివాని రాజశేఖర్ తో కలసి 'వెన్నెల' అనే ఫాంటసీ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్ మరియు ఎస్.ఒరిజినల్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
అలానే 'జాంబీరెడ్డి' తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ - తేజ సజ్జా ''హను-మాన్'' అనే సూపర్ హీరో సినిమా తెరకెక్కుతోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందే ఈ చిత్రంలో సూపర్ హీరో తేజ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా స్పైడర్ మ్యాన్ - బ్యాట్ మ్యాన్ తరహాలో ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.