ఆరెక్స్ బ్యూటీ కోలీవుడ్ ఎంట్రీ ఫిక్స్

Update: 2018-09-22 06:46 GMT
చిన్న సినిమాగా విడుదలైన 'RX100' బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో డైరెక్టర్ అజయ్ భూపతి తో పాటు లీడ్ యాక్టర్స్ అయిన కార్తికేయ - పాయల్ రాజ్ పుత్ కు మంచి బ్రేక్ వచ్చింది.  హీరోయిన్ విషయం తీసుకుంటే ఇప్పటికే ఆమెకు ఆఫర్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. కానీ సినిమా కంటెంట్.. తన పాత్ర ప్రాముఖ్యత చూసి మాత్రమే సినిమాకు సైన్ చేస్తోందట పాయల్.

ఇదిలా ఉంటే పాయల్ వైపు తెలుగు ఫిలిం మేకర్స్ మాత్రమే కాదు... కోలీవుడ్ నిర్మాతలు కూడా చూస్తున్నారట.  ఇప్పటికే పాయల్ కు తమిళ సినిమా ఆఫర్ రావడం.. సైన్ చేయడం కూడా జరిగిపోయింది.  DMK పార్టీ చీఫ్ స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కనున్న 'ఏంజెల్' అనే సినిమాలో పాయల్ హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   దాదాపు డజన్ సినిమాల్లో హీరోగా నటించిన ఉదయనిధి స్టాలిన్ కు తన కెరీర్లో రెండు మూడు హిట్స్ కూడా ఉన్నాయి. బ్యాకప్ ఉంది కాబట్టి బడ్జెట్ లు కూడా  డీసెంట్ గానే ఉంటాయి.

ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఆనంది ని ఎంపిక చేసినట్టు సమాచారం.  ఈ సినిమాను KS అదియమాన్ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. గతంలో ఈ డైరెక్టర్ 'ప్రియసఖి' అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాను రామ్ శరవణన్ OST ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.
Tags:    

Similar News