• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆగష్టులో ప్రారంభం కానున్న...

ఆగష్టులో ప్రారంభం కానున్న పవర్ స్టార్ కొత్త సినిమా!

By - Tupaki Desk
Update: 2020-06-09 10:50 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' షూటింగు దశలో ఉండగానే తన తదుపరి చిత్రం క్రిష్ తో ఉంటుందని తెలిసిందే. అయితే తదుపరి సినిమా తనతోనే కాబట్టి స్క్రిప్ట్, సెట్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నాడట క్రిష్. పవర్ స్టార్ భారీ గ్యాప్ తర్వాత 26వ చిత్రం వకీల్ సాబ్ చేస్తున్నాడు. అయితే వకీల్ సాబ్ సినిమా హిందీ పింక్ నుండి రీమేక్ చేస్తున్నాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. రాజకీయాల తర్వాత పవర్ స్టార్ రీఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కాబట్టి అభిమానులలో అంచనాలు మాత్రం మిన్నంటేలా నెలకొన్నాయి. అలాంటిది తదుపరి చిత్రం విరూపాక్ష గురించి చిన్న వార్త తెలిసినా అభిమానులకు పెద్ద పండగే అవుతుంది. పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఏయం రత్నం నిర్మిస్తుండగా.. ఈ సినిమా మొఘలుల సామ్రాజ్యంలోని ఒక బందిపోటు కథతో తెరకెక్కనుందని తెలుస్తుంది. ఇది మొగలాయిల కాలం నాటి కథ అని.. సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుందని ఇదివరకే తెలిపారు.

అయితే ఈ చారిత్రాత్మక క‌థ‌ను క్రిష్ కూడా పవన్‌ రేంజ్ ఇమేజ్ కి స‌రిపోయేలా తయారు చేస్తున్నాడట. ఇక పీరియాడిక్ సినిమా కావడంతో రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను ఆ కాలం నాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే గొప్ప చిత్రంగా నిలుస్తుందని, పవన్ కళ్యాణ్ నటించనున్న ఫస్ట్ హిస్టారికల్ మూవీ గనక సినిమా కూడా హిస్టారికల్ హిట్ అవుతుందని అభిమానులు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ చాలా కాలం గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ సినిమా పై పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ జులై సెకండ్ వీక్ నుండి ప్రారంభం కానుందని ఇదివరకు వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. షూటింగ్ ఆగష్టు నెల సెకండ్ వీక్ నుండి ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాది చివరి లోపు పూర్తి చేయడానికి క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక క్రిష్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ తో చేతులు కలపనున్నాడు. చూడాలి మరి నిజంగా ఆగష్టులో షూటింగ్ మొదలైతే అభిమానులకు కాస్త ఊరట లభిస్తుందని చెప్పాలి!
Tags:    
  • pawan kalyan 
  • krish 
  • shooting 
  • August 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS