ఖుషీ తర్వాత గబ్బర్ సింగ్ వరకూ ఎదురు చూశా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించి క్రియా శీల రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. మొన్న జనరల్ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ ఏపీలో ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పోటీ చేసిన రెండుచోట్లా పవన్ ఓటమిని చవి చూశారు. ఆ క్రమంలోనే అతడు తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని ఓ మాస్ డైరెక్టర్ కి ఆఫర్ ఇచ్చారని.. రకరకాలుగా ప్రచారం సాగుతోంది. అయితే తాను సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేది లేదని పవన్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో రాణించేందుకే తుది కంటా ప్రయత్నిస్తానని ప్రకటించారు.
ప్రస్తుతం పవర్ స్టార్ తానా మహాసభల్లో పాల్గొంటున్నారు. అమెరికా వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న ఈ సభల్లో పవర్ స్టార్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. సూటిగా అభిమానుల గుండెల్లోకి దూసుకెళ్లే కొన్ని బుల్లెట్లను గబ్బర్ సింగ్ పేల్చారు. ఎన్నికల్లో ఓటమి గురించి ప్రస్థావిస్తూ.. ``ఈ ఓటమిని బ్యాడ్ అని భావించడం లేదు. జనసేన విలువలను పాటించి ఓటమి పాలైంది. ఎన్నికల పరాజయాన్ని కేవలం 15 నిమిషాల్లోనే నేను అంగీకరించాను. ఖుషీ తర్వాత చాలా కాలం ఎదురు చూస్తే కానీ సక్సెస్ రాలేదు. తిరిగి `గబ్బర్ సింగ్` తోనే విజయం వచ్చింది. ఎన్నికల్లో గెలిచేందుకు అదేవిధంగా సుదీర్ఘ కాలం వేచి చూస్తా`` అని అన్నారు.
పవన్ వ్యాఖ్యాల్ని బట్టి ఇప్పట్లో తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేదని అర్థమవుతోంది. పూర్తి స్థాయిలో రాజకీయాలకే ఆయన అంకితం కానున్నారు. ఇకపోతే గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ పవన్ ని తిరిగి హీరోగా రీబూట్ చేస్తారని సాగిన ప్రచారంలోనూ నిజం లేదని తేలిపోయింది. ప్రస్తుతం అమెరికాలో 22వ తానా సభలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పలువురు సినీప్రముఖులు హాజరవుతున్నారని తెలుస్తోంది.