సూర్య, మహేష్ ఒకే నెంబర్..అతడు మాత్రం అన్నయ్యలా!
మహేష్ టాలీవుడ్ సూపర్ స్టార్ గా, దళపతి విజయ్, సూర్య కోలీవుడ్ సూపర్ స్టార్స్ గా నీరాజనాలు అందుకుంటున్నారు .;
మహేష్ టాలీవుడ్ సూపర్ స్టార్ గా, దళపతి విజయ్, సూర్య కోలీవుడ్ సూపర్ స్టార్స్ గా నీరాజనాలు అందుకుంటున్నారు . ఈ ముగ్గురు కోట్లాది మంది అభిమానించే తారలు. నటన పరంగా ఎవరి ప్రత్యేకత వారిది. మహేష్, విజయ్ లు కమర్శియల్ స్టార్స్ గా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సూర్య ప్రయోగాలతో పాటు కమర్శియల్ ఇమేజ్ ఉన్న నటుడు. ప్రస్తుతం ముగ్గురి ప్రయాణం సోంత పరిశ్రమలో దేదీప్యమానంగా సాగిపోతుంది. అయితే ఈ ముగ్గురి మధ్య ఓ సారూప్యత ఉంది. ముగ్గురు హీరోలిప్పుడు ఒకే ఏజ్ 50-51 మధ్యలో ఉన్నారు.
మహేష్ 1975 ఆగస్టు 9న జన్మించగా, సూర్య 1975 జులై 23న జన్మించారు. మహేష్- సూర్యలిద్దరు కరెక్ట్ గా 50 కొనసాగుతుండగా విజయ్ 1974 జూన్ 22న జన్మించడంతో? అతడి వయసు సూర్య, మహేష్ ల కంటే ఏడాది ఎక్కువగా ఉంది. ఇలా ముగ్గురు స్టార్ల మధ్య వయసులు సరి సమానంగా మ్యాచ్ అవ్వడం అన్నది ఇంట్రెస్టింగ్. చిత్ర పరిశ్రమలో వారి ప్రయాణం కూడా ఎంతో ఆసక్తికరమైంది. మహేష్ బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి అంచ లంచెలుగా ఎదిగారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి దిగ్విజయంగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` అనే పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ఈసినిమా రిలీజ్ అనంతరం మహేష్ గ్లోబల్ స్టార్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక సూర్య తండ్రి శివ కుమారు నటుడైనా? సూర్య నట ప్రస్తానం మొదలయ్యే సమయానికి శికుమార్ నటుడిగా యాక్టివ్ గా లేరు. దీంతో సూర్య తన కెరీర్ ని తానే బిల్డ్ చేసుకుని పరిశ్రమలో ఎదిగాడు. నటుడు అవ్వకముందే ఓ ప్రయివేట్ జాబ్ కూడా చేసాడు. అనంతరం సినిమాల్లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రవేశించి నటుడిగా ప్రమోట్ అయ్యాడు.
దళపతి విజయ్ తండ్రి ఎస్. చంద్రశేఖర్ పెద్ద దర్శకుడి కావడంతో? తండ్రి సారథ్యంలో తనయుడు నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు. బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అటుపై హీరోగా కూడా తండ్రి ఆధ్వర్యంలోనే లాంచ్ అయ్యాడు. ఆ తర్వాత డాడ్ దర్శకత్వంలో చాలా సినిమాల్లో హీరోగా నటించి అగ్ర తారగా ఎదిగాడు. అయితే కొంత కాలంగా విజయ్ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు. ప్రోఫెషనల్ గా కూడా డాడ్ తో విజయ్ కొనపసాగడం లేదు.