త్రివిక్రమ్ తో పవన్ ఫుల్ స్టాప్ ??
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ తొలి వారంలో ప్రారంభమైన షూటింగ్ కి.. చిన్న చిన్న బ్రేకులు తప్ప షూటింగ్ జరిగిపోతూనే ఉంది. ఎప్పటిమాదిరిగానే పవర్ స్టార్ మూవీకి సంబంధించిన ఏ అప్ డేట్ బయటకు రావడం లేదు. మాటల మాంత్రికుడితో పవన్ చేస్తున్న మూవీకి.. ఇప్పటికే #PSPK25 అంటూ హ్యాష్ ట్యాగ్ తలిగించేసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
అభిమానుల సంబరాలకు ఓ యాంగిల్ లో బ్రేక్ పడిపోయే న్యూస్ ఇది. త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాతో.. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేయనున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత చేస్తాడో తెలీదు కానీ.. 2019 ఎలక్షన్స్ వరకూ మాత్రం పవన్ కు ఇదే ఆఖరి చిత్రం అనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే తనతో సినిమాలకు కమిట్ అయిన దర్శక నిర్మాతలకు క్లారిటీ ఇచ్చేశాడట పవన్. పొలిటికల్ గా యాక్టివ్ నెస్ పెంచాల్సిన అవసరం ఉండడం.. అనేక జిల్లాల్లో పర్యటించాల్సి ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడట పవన్.
అనంతపూర్ నుంచి ఎన్నికల్లో నిలబడతానని చెప్పిన పవన్.. ఏ నియోజకవర్గం అనే విషయంపై డిస్కషన్స్ జరుపుతున్నాడట. అలాగే జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టడం కోసం.. ప్రస్తుతానికి సినిమాలకు ఓ ఫుల్ స్టాప్ పెట్టేయాలని డిసైడ్ అయినట్లు టాలీవుడ్ లో తెగ చెప్పేసుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/