మరి త్రివిక్రమ్ సంగతేంటి బాస్
పవన్ కళ్యాణ్ కు ఈ మధ్య షాకులివ్వడం బాగా అలవాటైపోయింది. గత ఏడాది వరకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో తాపీగా ఉన్న పవన్.. ఈ ఏడాది ఆరంభం నుంచి రేయింబవళ్లు పని చేసి.. ఏప్రిల్ 8న సినిమాను రిలీజ్ చేసి షాకిచ్చాడు. ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే సడెన్ గా ఒక రోజు ఎస్.జె.సూర్య దర్శకత్వంలో కొత్త సినిమా మొదలుపెట్టి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత సూర్య ఆ సినిమా తప్పుకోవడమూ షాకే. ఇక డాలీ దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సంగతి వదిలేసి ఉన్నట్లుండి పొలిటికల్ మీటింగులు పెట్టడం ద్వారానూ పవన్ ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక.. దసరా రోజు సడెన్ గా తమిళ దర్శకుడు నీశన్ డైరెక్షన్లో తన కొత్త సినిమా మొదలుపెట్టి మరో షాకిచ్చాడు పవన్.
మొన్నటిదాకా అందరూ పవన్ తర్వాతి సినిమా త్రివిక్రమ్ తోనే అనుకుంటూ వచ్చారు. ఆ సినిమా కోసం నవంబర్లోనే కొన్ని డేట్లు ఇచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ కూడా వేరే కమిట్మెంట్లతో ఏమీ లేడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఈ ఏడాదే సినిమా మొదలు అనుకుంటుంటే.. మధ్యలోకి నీశన్ వచ్చాడు. అతను బౌండెడ్ స్క్రిప్టుతో రంగంలోకి దిగేశాడు. మరి ఈ సినిమాకు పవన్ ఎప్పట్నుంచి డేట్లు ఇస్తున్నాడో ఏమో కానీ.. త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది ఊహించని పరిణామమే. మరి పవన్ కోసం ఆల్రెడీ కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ సంగతేంటో.. అతను ఈ మధ్యలో మరో సినిమా ఏదైనా లైన్లో పెడుతున్నాడేమో తెలియదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/