వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ భార్యా పిల్లల ఫోటోలు..!

Update: 2020-12-18 05:40 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎలాంటి విషయమైనా అభిమానులు దాని గురించి ఆరా తీస్తుంటారు. ఇటీవల నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి వేడుకలో ఆయన మూడో భార్య అన్నా లెజ్‌ నేవా కనిపించనందుకు పెద్ద ఎత్తున డిస్కషన్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ - రేణూ దేశాయ్ లకు కలిగిన పిల్లలు అకీరా నందన్ - ఆధ్య కనిపించినందుకు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ.. అన్నా తోపాటు కొడుకు మార్క్‌ శంకర్ పవనోవా‌ - కూతురు పొలెనా అంజనా పవనోవా కనిపించందుకు నిరాశ చెందారు. అయితే వారు క్రిస్మస్ వేడుకల కోసం రష్యా వెళ్లడంతో నిహారిక పెళ్లికి హాజరు కాలేకపోయారని వార్తలు వినిపించాయి. కానీ క్రిస్‌మస్‌ ఇంకా ముగియకుండానే ఇప్పుడు ఆకస్మికంగా పవన్ భార్య మరియు పిల్లలతో హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టులో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అన్నా లెజ్‌ నేవా మరియు మార్క్‌ శంకర్ పవనోవా‌ - పొలెనా అంజనా పవనోవా సంబంధించిన ఎయిర్ పోర్టులో కనిపించిన దృశ్యాలు వైరల్‌ గా మారాయి. చాలా రోజుల తర్వాత పవన్ భార్య కెమెరా కంటికి చిక్కడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు చీరకట్టులో కనిపించిన అన్నా.. తాజాగా జీన్స్‌ మరియు టీషర్టులో ట్రెండీగా కనిపించారు. నిజానికి ఈ వేషాధారణలో ఆమెను చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి అన్నా ముఖానికి మాస్కు ధరించి ఎయిర్‌ పోర్టు నుంచి బయటకు వస్తున్నారు. పవన్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ భార్యా పిల్లలు కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది.
Tags:    

Similar News