ఇరానీ కేఫ్‌ లో కొడుతున్న పవన్

Update: 2017-06-18 07:45 GMT
పవన్ కల్యాణ్ ఈ పేరు వినిపిస్తినే అభిమానులుకు ఏదో శక్తి ఆవహించి నట్లు చెలరేగిపోతారు ఉత్తేజంతో. ఇప్పుడు పవన్ కొత్త సినిమా త్రివిక్రమ్ డైరక్షన్లో షూటింగ్ జరుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు దానిలో పవన్ ట్రేడ్ మార్క్ ఫైట్ షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్ సారధి స్టూడియోలో  మన పవర్ స్టార్ స్టైలిష్ ఫైట్ కోసం ఇరానీ కేఫ్  సెట్ వేశారట. ఇక్కడే మరి కొన్నిరోజులు ఈ ఫైట్ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది.  

పవన్ కళ్యాణ్‌  నడక - మాట - పాట - పరుగు - చూపు - ఫైట్ అన్నీ ఆ తరవాత వచ్చే చాలా యువ హీరోలు మీద గట్టి ప్రభావమే పడింది. అసలు మొదట పవన్ తన ఫైట్స్ తోనే స్టార్ అయ్యాడు అని చెప్పవచ్చు. పవన్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలో రియల్ ఫైట్ చేసి అందరిలో ఒక ఉత్కంఠ రేపాడు. ‘బద్రి’ లో కూడా తనదైన స్టైల్ తో పానిపూరి దగ్గర ఫైట్ కావచ్చు , ‘ఖుషీ’ సినిమాలో కత్తి ఫైట్ కానివ్వండి, తను డైరక్షన్ చేసిన ‘జాని’ క్లైమాక్స్ ఫైట్ కావచ్చు, మొన్న వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో కోట శ్రీనివాస్ రావు తో కళ్ళద్దాల ఫైట్ అక్కడ సంభాషణ అన్నీ కొత్తగా మరెవ్వరికీ సెట్ అవ్వని విధంగా చేసి ఒక ట్రెండ్ సెట్ చేశాడు. నేను ట్రెండ్ ఫాలో కాను ట్రెండ్ సెట్ చేస్తాను ఈ మాట పవన్ కల్యాణ్ కు అచ్చంగా సరిపోతుందని ఎప్పటికప్పుడ ప్రూవ్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ ఇరానీ కేఫ్‌ ఫైట్ కూడా అదే స్టయిల్లో డిఫరెంట్ గా ఉంటుందట.

ఇకపోతే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కు జోడీగా ఇద్దరు ముద్దు గుమ్మలు నటిస్తున్నారు. నేను లోకల్ ఫేమ్ కీర్తి సురేశ్ ఇంకా అను ఎమాన్యుల్ నటిస్తున్నారు. తివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News