పవన్ నెల రోజులు ఏం చేయబోతున్నాడు?

Update: 2017-01-17 10:31 GMT
తన గత సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు తోచినపుడు షూటింగుకి వచ్చాడు పవన్ కళ్యాణ్. దీంతో ఆ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి.. చివర్లో హడావుడిగా షూటింగ్ జరుపుకుంది. ఔట్ పుట్ దెబ్బ తిని.. సినిమా రిజల్ట్ కూడా తేడా కొట్టేసింది. ఐతే ‘కాటమరాయుడు’ విషయంలో అలా చేయట్లేదు పవన్. సినిమా మొదలవడంలో కొంచెం ఆలస్యం జరిగినప్పటికీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యాక నిర్విరామంగా కొనసాగుతోంది. పవన్ కూడా దీక్షగా షూటింగుకి హాజరవుతున్నాడు. ఇంకో రెండు మూడు వారాల్లో ఈ సినిమా పూర్తయిపోతుందని సమాచారం. దీని తర్వాత వెంటనే త్రివిక్రమ్ సినిమాను పవన్ మొదలుపెట్టేయాల్సి ఉంది కానీ.. ఇప్పుడు షెడ్యూళ్లు మారాయట.

పవన్-త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆలస్యం కానుంది. ‘కాటమరాయుడు’ పూర్తయ్యాక నెల రోజులు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు పవన్. ఈ విషయమే త్రివిక్రమ్ కు కూడా చెప్పేశాడట. ఈ నెల విశ్రాంతి కోసం తీసుకుంటున్న విరామం కాదు. త్రివిక్రమ్ సినిమా కోసం తయారవడానికి తీసుకుంటోంది. ‘కాటమరాయుడు’ నడి వయస్కుడి పాత్ర కావడంతో పవన్ కొంచెం బరువు పెరిగాడు. బొద్దుగా కనిపిస్తున్నాడు. కానీ త్రివిక్రమ్ సినిమాలో కొంచెం యూత్ ఫుల్ గా కనిపించాల్సి ఉండటంతో లుక్ మార్చుకోనున్నాడు పవన్. అందుకోసమే ఓ ప్రొఫెషనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో కసరత్తులు చేయనున్నాడట పవన్. దీంతో త్రివిక్రమ్ సినిమా కొంచెం ఆలస్యంగా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఐతే షూటింగ్ మొదలయ్యాక మాత్రం విరామాలుండవట. ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకు విడుదల చేయాలన్న ప్రణాళికతో ముందుకెళ్లనుంది ఈ చిత్ర యూనిట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News