పవన్ సినిమా.. ఇంకా రెండు నెలల టైం

Update: 2016-12-16 09:30 GMT
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మూవీ ఇప్పటికే ముహూర్తం షాట్ జరుపుకుని అధికారికంగా ప్రారంభమైంది. ఇప్పటికే మలయాళీ భామ కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా ఫైనల్ కాగా.. మరో భామగా అను ఇమాన్యుయేల్ ని ఫిక్స్ చేశారనే వార్తలున్నాయి.

అయితే.. ప్రస్తుతం పవన్ కు పొలిటికల్ ఎంట్రీకి మధ్య గ్యాప్ తక్కువగా ఉండడంతో కాసింత స్పీడ్ గా సినిమాలు చేసేస్తాడని.. ఒకేసారి రెండు సినిమాలు షూట్ చేస్తాడని అన్నారు. కాటమరాయుడుతోపాటే త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ను కూడా పవన్ ప్రారంభించేస్తాడని అనుకున్నా.. ఇప్పుడు కథ మారిపోయిందట. ఫిబ్రవరిలోనే త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేస్తాడట పవన్. జనవరి చివరికల్లా కాటమరాయుడును కంప్లీట్ చేసి.. ఫిబ్రవరిలో త్రివిక్రమ్ మూవీని మొదలుపెట్టేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

 ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నాడు. మిగిలిన నటీనటులు.. సాంకేతిక వర్గాన్ని ఫైనలైజ్ చేయడంలో బిజీగా ఉన్నాడు దర్శకుడు త్రివిక్రమ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News