పవన్ విత్ త్రివిక్రమ్.. క్లాప్ కొట్టేశారు
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్.. టాలీవుడ్ లో క్రేజీయెస్ట్ కాంబినేషన్ ఇది. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా కావడంతో.. ఆ కాంబో సెట్ అవుతోంది అనగానే అంచనాలతో పాటు ఎంక్వైరీలు కూడా మొదలైపోయాయి. దాదాపు 3 నెలల క్రితమే పవర్ స్టార్ తో మాటల మాంత్రికుడి సినిమా ఖాయం అయినా.. ఇవాళ అధికారికంగా షూటింగ్ ను ప్రారంభించారు.
నవంబర్ 5న రామానాయుడు స్టూడియోలో మాటల మాంత్రికుడితో పవన్ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఫస్ట్ షాట్ ను దేవుడి పటాలపై చిత్రీకరించగా.. పవన్ కళ్యాణ్ స్వయంగా క్లాప్ కొట్టాడు. పవన్ తో పాటు దర్శక నిర్మాతలు.. ఇతర సన్నిహితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యాయరు.
ఈ క్రేజీ ప్రాజెక్టుకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. దేశంలో టాప్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన వి మణికందన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ఈయన మణిరత్నం రావణ్.. శంకర్ అపరిచితుడు వంటి చిత్రాలకు ఫోటోగ్రఫీ అందించాడు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత రాధాకృష్ణ ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/