పవన్-త్రివిక్రమ్.. శాటిలైట్ లెక్క ఇదీ

Update: 2017-07-11 11:15 GMT
పవన్ కళ్యాణ్ చివరగా ఎప్పుడో నాలుగేళ్ల కిందట ‘అత్తారింటికి దారేది’తో హిట్టు కొట్టాడు. ఆ తర్వాత పవర్ స్టార్ నుంచి వచ్చిన సినిమాలన్నీ నిరాశకు గురి చేశాయి. అయినప్పటికీ సినిమా సినిమాకూ పవన్ మార్కెట్ స్టామినా పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు పవన్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ జరిగింది. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ‘కాటమరాయుడు’కు తక్కువ బిజినెస్ ఏమీ కాలేదు. దాన్ని కూడా ‘సర్దార్..’ స్థాయిలోనే అమ్మారు. ఆ సినిమా ఫలితమేంటో చెప్పాల్సిన పని లేదు. అయినా ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాకు అమ్మకాలు రికార్డు స్థాయిలోనే జరుగుతున్నాయి. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ రూ.100 కోట్లకు పైనే పలుకుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో పాటు మిగతా హక్కుల రేట్లు కూడా మామూలుగా లేవు. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ఏకంగా రూ.19.5 కోట్లు పలికినట్లు సమాచారం. సన్ నెట్ వర్క్ వాళ్లు ఈ రికార్డు రేటు పెట్టి సినిమాను కొనేశారట. ఇది నాన్-బాహుబలి సినిమాల్లో రికార్డని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రానికి ఓవర్సీస్ రైట్స్ రూ.25 కోట్ల దాకా పలుకుతున్నట్లు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ బిజినెస్ పరంగా నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ పవన్-త్రివిక్రమ్ సినిమా బద్దలు కొట్టేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ రూ.150 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. వసూళ్లు కూడా అనూహ్యంగానే ఉంటాయనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News