పవన్ సినిమాకి రైట్స్ అంత పలికాయా?

Update: 2017-06-06 12:21 GMT
ప్రస్తుతం సెట్స్ పై ప్రాజెక్టుల లిస్ట్ లో పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ మూవీ టాప్ లోనే ఉంటుంది. జల్సా.. అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత పవర్ స్టార్- మాటల మాంత్రికుడు కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఆసక్తి ఎక్కువగానే ఉంది. ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ సంగతేమో కానీ.. ఈ మూవీపై డిస్ట్రిబ్యూటర్లు భారీగా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు.

ఇంకా సినిమా షూటింగ్ సగం కూడా పూర్తవకపోయినా.. అప్పుడే తెలుగు రాష్ట్రాల వరకూ రైట్స్ అమ్మేశారట కూడా. ఈ చిత్రానికి ఏపీ- తెలంగాణల నుంచే థియేట్రికల్ రైట్స్ రూపంలో 94 కోట్లూ సమకూరడం విశేషంగా చెప్పుకోవాలి. అంటే.. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 100 కోట్లు వస్తే కానీ ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ రాదని అర్ధం. ఇది చాలా పెద్ద టార్గెట్ అని చెప్పాల్సిందే. రైట్స్ రేట్స్ విషయంలో బాహుబలి తొలి భాగం కంటే పవన్-త్రివిక్రమ్ కాంబోకి ఎక్కువ పలకగా.. బాహుబలి2 కంటే తక్కువే.

ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో టాప్2లో నిలుస్తోంది ఈ చిత్రం. ఏపీ-తెలంగాణ మార్కెట్ వరకూ తొలి స్థానంలో ఉన్న బాహుబలి2కి 130 కోట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ మూవీ 94 కోట్ల బిజినెస్ చేసింది. బాహుబలి ది బిగినింగ్ 65.5 కోట్లు.. ఖైదీ నంబర్ 150కి 62 కోట్లు, కాటమరాయుడు 61.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో టాప్ 5లో ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News