బాలీవుడ్ నుంచి పవన్ కు 11కోట్లు?

Update: 2017-06-20 10:00 GMT
పవన్ కళ్యాణ్ కు బాలీవుడ్ ఎంట్రీ అస్సలు బాలేదు. తెలుగులో మాత్రమే సినిమాలు చేసే పవర్ స్టార్.. తొలిసారిగా సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో మాత్రం హిందీ రిలీజ్ ప్లాన్ చేసుకున్నాడు. రిలీజ్ కూడా బాగానే జరిగింది కానీ.. రిజల్ట్ మాత్రం చాలా దారుణంగా వచ్చింది. ప్రింట్స్ అండ్ పబ్లిసిటీ ఖర్చులు కూడా థియేట్రికల్ వసూళ్లరూపంలో రాలేదని అంటారు.

అయితే.. మరోసారి బాలీవుడ్ లో తన సినిమా రిలీజ్ చేసేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ హీరోగా రూపొందుతున్న చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ విషయం ఖాయమైపోయింది. ఎందుకంటే ఈ చిత్రం హిందీ వెర్షన్ రైట్స్ ద్వారా నిర్మాతలకు ఇప్పటికే 11 కోట్ల రూపాయలు ముట్టినట్లు తెలుస్తోంది. అయితే.. ఇదేమీ కేవలం థియేట్రికల్ హక్కుల కోసం మాత్రమే కాదు. హిందీ వెర్షన్ కు సంబంధించిన శాటిలైట్.. డిజిటల్ హక్కులు కూడా కలిపి 11 కోట్ల రూపాయల మొత్తాన్ని పవన్-త్రివిక్రమ్ మూవీ వసూలు చేయగలిగింది.

ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ సినిమాలకు హిందీలో మంచి డిమాండ్ నెలకొంది. రీసెంట్ గా సరైనోడు హిందీ వెర్షన్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే 4 కోట్ల వ్యూస్ రావడం సెన్సేషన్ అయిపోయింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News