• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరోను...

ఆ హీరోను వ్యతిరేకించినందుకు తొక్కేస్తున్నారట!

By - Tupaki Desk
Update: 2018-10-23 10:42 GMT
మలయాళ హీరోయిన్‌ భావనను కిడ్నాప్‌ చేసి లైంగికంగా వేదించిన కేసులో నటుడు దిలీప్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. విచారణ ఎదుర్కొంటున్న దిలీప్‌ - కొన్నాళ్ల పాటు జైలు జీవితాన్ని కూడా గడిపాడు. బెయిల్‌ పై బయటకు వచ్చిన దిలీప్‌ ను మళ్లీ మలయాళ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ (అమ్మ)లోకి తీసుకోవడంపై కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఒక మహిళను కిడ్నాప్‌ చేసి - లైంగికంగా వేదించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దిలీప్‌ ను ఎలా అమ్మలోకి తీసుకుంటారు - ఆయనకు సినిమాల్లో ఛాన్స్‌ లు ఎలా ఇస్తారు అంటూ కొందరు దిలీప్‌ కు వ్యతిరేకంగా గలం ఎత్తారు.

దిలీప్‌ కు వ్యతిరేకంగా గళం ఎత్తిన వారిలో హీరోయిన్‌ పార్వతి కీలక పాత్ర పోషించారు. దిలీప్‌ ను అమ్మలోకి తీసుకోవడంతో కొందరు ప్రత్యేకంగా సంఘంను పెట్టుకున్నారు. ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారట. ఆ సంఘంలో సభ్యులుగా ఉన్న వారికి మలయాళ సినిమాల్లో ఆఫర్లు రాకుండా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారట. తనకు కూడా కేవలం ఒకే ఒక్క సినిమా చేతిలో ఉందని - తాను ప్రస్తుతం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లుగా పార్వతి పేర్కొంది.

తాజాగా పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. నేను ప్రస్తుతం ఒకే ఒక్క సినిమాలో నటిస్తున్నాను, ఆ తర్వాత నాకు ఛాన్స్‌ లు వస్తాయనే నమ్మకం లేదు. ఇక నేను ప్రతి రోజు కూడా భయంతో బతికేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌ లో మీటూ అంటూ ఆరోపణలు చేస్తున్న వారికి అక్కడ ప్రముఖుల నుండి మద్దతు లభిస్తుంది. కాని మాలీవుడ్‌ లో మాత్రం పరిస్థితి వేరుగా ఉందని పార్వతి ఆవేదన వ్యక్తం చేసింది. ‘బెంగళూరు డేస్‌’ చిత్రంతో పాటు పలు మలయాళ చిత్రాలతో ఆకట్టుకున్న పార్వతికి ఇప్పుడు అవకాశాలు లేకపోవడం దారుణం అంటూ ఆమె సన్నిహితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Parvathy 
  • Movie Offers 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS