ఆ సినిమా కోసం ఎన్టీఆర్ నిరీక్షణ

Update: 2017-05-05 07:43 GMT
ప్రతీ డైరెక్టర్ కి ఫలానా నటుడుతో పని చేయాలిని ఉంటుంది. అలాగే ప్రతీ నటుడుకి వాళ్ళు ఇష్టపడే డైరెక్టర్ దగ్గర నటించాలని అనుకోవడం సహజం. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ చాలా సార్లు చెప్పాడు.. నేను త్రివిక్రమ్ డైరక్షన్ లో నటించాలని ఆశపడుతున్నాను అతని సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అని. ఇప్పుడు ఎన్టీఆర్ ఎదురుచూపు ఫలించిందనే చెప్పాలి.

ఎన్టీఆర్ ఇప్పుడు 'జై లవ కుశ' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్లో విడుదల అవుతుంది. అయితే ఇటు త్రివిక్రమ్ కూడా పవన్ కల్యాణ్ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయడానికి విరామం లేకుండా పని చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా అక్టోబర్లో మొదలుపెట్టడానికి సన్నాహాలు జరుతున్నాయి. స్క్రిప్ట్ కూడా అప్పటికి పూర్తవుతుంది అని తెలుస్తోంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాని రాధ కృష్ణ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే ఈ ఫిల్మ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతుంది. ఇంకా పూర్తి నటి నటులును ఎంపిక జరగలేదు. త్రివిక్రమ్ కుటంబం నేపధ్య సినిమా  ఎంత బాగా రాస్తారో చెప్పే పనిలేదు. ఈ సినిమాతో  ఎన్టీఆర్ ఫ్యామిలి ప్రేక్షకులు కూడా మరింత దగ్గరై ఆంధ్ర తెలంగాణ లో తన మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. లెటజ్ సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News