RRR లో స్క్రీన్ స్పేస్ పై ఎన్టీఆర్ స్పందన..!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ''ఆర్.ఆర్.ఆర్'' మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన అన్ని భాషల్లో విశేష దక్కించుకుంటున్న ఈ సినిమా.. దానికి తగ్గట్టుగానే వసూళ్లతో దూసుకుపోతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే కొందరు తారక్ అభిమానులు మాత్రం కొమురం భీమ్ పాత్ర పట్ల అసంతృప్తి చెందినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ ని బట్టి అర్థం అవుతోంది.
చరణ్ పాత్ర కంటే ఎన్టీఆర్ పాత్ర కి తక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారని.. ముఖ్యంగా ద్వితీయార్థంలో తారక్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని జక్కన్న పై మండిపడుతున్నారు. క్లైమాక్స్ ఫైట్ లో చరణ్ హైలెట్ అయ్యేలా డిజైన్ చేశారని ఫ్యాన్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వార్తలపై ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ స్పందించారు. RRR సినిమాలో ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారని తెలిపారు. ఒక సమయంలో ఒకరిని ఎలివేట్ చేసే సీన్స్ ఉండగా.. మరికొన్ని చోట్ల ఇంకో హీరో ఎలివేషన్ సన్నివేశాలను ఉంచారని అభిప్రాయ పడ్డారు.
తన పాత్రకు సంబంధించి ఎటువంటి అసహనం లేదని స్పష్టం చేశారు. రెండు పాత్రలు కూడా అద్భుతంగా ఉన్నాయని.. ఏ ఒక్కరినీ తక్కువ చేయలేదని.. అందువల్లే ట్రిపుల్ ఆర్ అంత అందంగా తీర్చిదిద్దబడిందని తారక్ అన్నారు.
నిజానికి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ RRR వంటి ప్రతిష్టాత్మకమైన సినిమాలో భాగం కావడం తమ అదృష్టమని ఇప్పటికే తెలియజేసారు. ప్రమోషన్స్ సమయంలోనూ తారక్ పాత్ర అధిక శ్రమతో కూడుకున్నదని అంగీకరించారు. ఎన్టీఆర్ సైతం చెర్రీ పాత్రను పలు సందర్భాల్లో కొనియాడారు. ఇది ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇవ్వబడిందని సూచిస్తుంది.
'RRR' చివరలో రామ్ చరణ్ ను అల్లూరి సీతారామరాజు గెటప్ లో చూపించడం వల్ల కాస్త హై వచ్చిందని అర్థం అవుతోంది. అదే సమయంలో 'కొమరం భీముడో' పాటలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారని ఎమోషన్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో రామారావు - భీమ్ పాత్రలను కంపేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నప్పటికీ.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ తమ వ్యక్తిగత పాత్రలకు సంబంధించిన ఔట్ ఫుట్ తో సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ విషయం మీద ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.