ముంబై పార్టీలో తారక్ సింప్లిసిటీ చూశారా..!
ఎక్కడకు వెళ్లినా.. ఎందెందు అడుగుపెట్టినా.. అక్కడ తనదైన ప్రతిభతో ఆకట్టుకోవడం తారక్ శైలి. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో తెలుగోడి సత్తా ఎంతో పాన్ ఇండియా లెవల్లో చాటడంలో యంగ్ యమ పెద్ద సక్సెసయ్యాడు. చరణ్ తో కలిసి అద్భుత పెర్ఫామెన్స్ తో ఎన్టీఆర్ అదరగొట్టాడన్న టాక్ వచ్చింది.
ఇప్పుడు తారక్ కి హిందీ బెల్ట్ లోనూ ఫాలోయింగ్ పెరిగింది. మునుముందు బాలీవుడ్ లో అగ్ర దర్శకులతో తారక్ సినిమాలు చేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా సంజయ్ లీలా భన్సాలీ లాంటి కళాత్మక దర్శకుడితో పని చేయాలన్న తన తృష్ణను ఇటీవల బయటపెట్టాడు. ఇకపై అందుకు ఆస్కారం లేకపోలేదు.
RRR హిందీ వెర్షన్ బంపర్ హిట్ కొట్టింది. ఈ సందర్భంగా సక్సెస్ పార్టీ కోసం ముంబైకి వెళ్లాడు తారక్. ఇలా వెళుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సాధారణ చొక్కా - డెనిమ్ లో సింపుల్ గా కనిపించాడు. ఈ ఫోటోగ్రాఫ్ హైదరాబాద్ విమానాశ్రయం నుంచి లీకైంది. బ్లూ డెనిమ్స్.. బ్లాక్ రౌండ్ నెక్ పై కోట్ కాంబినేషన్ .. బ్లాక్ ఫార్మల్ షూస్ తో తారక్ కనిపించారు. స్మైలిస్తూ కోటి హృదయాల్ని గెలుచుకున్నాడు!