చెమ‌ట‌లో త‌డిసి ర‌క్త‌సిక్త‌మై కొమ‌రం భీముడో..!

Update: 2022-03-29 02:30 GMT
RRR ఇటీవ‌లే రిలీజై ఇంటా బ‌య‌టా రికార్డుల మోత మోగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భీమ్ గా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్య‌త లేద‌ని ఒక సెక్ష‌న్ వాదిస్తుంటే.. అతని భీకర న‌ట‌ ప్రదర్శనకు ఎన్నో మ‌చ్చు తున‌క‌లు ఉన్నాయి అంటూ అభిమానులు కొన్న‌టిని ఉద‌హ‌రిస్తున్నారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ `కొమరం భీముడో` పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ పాట చిత్రీక‌ర‌ణ కోసం తార‌క్ కు ఏకంగా 15 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టిందని సన్నిహిత వ‌ర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 1.31 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకున్న కొమరం భీముడో సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. తాజా వీడియోల్లో నిరంకుశ బ్రిటీష్ వారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ బహిరంగంగా కొరడా ఝులిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ పాట కోసం దిగ్గ‌జాలు ప‌ని చేశారు. వారి క‌ల‌యిక పెద్ద సక్సెసైంది. ప్రముఖ తెలుగు గీత రచయిత సుధాల అశోక్ తేజ రచించిన ఈ పాట బలమైన దేశభక్తి భావాన్ని కలిగిస్తుంది. ఎం.ఎం కీరవాణి స్వరపరచ‌గా కాల భైరవ పాడారు. కొమరం భీముడో పాట షూటింగ్ 15 రోజుల పాటు సాగింది.
షూటింగ్ సమయంలో 600 మందితో కూడిన బ్యాక్ గ్రౌండ్ జనంతో ఎండ వేడిమిలో ఎన్టీఆర్ షూట్ చేయాల్సి వచ్చింది.  నిజానికి షూట్ స‌మ‌యంలో ప్లాట్ ఫారమ్ వేడిగా ఉంది.. తారక్ దానిపై చెప్పులు లేకుండా నిలబడవలసి వచ్చింది. చిత్ర‌ బృందం ఎంత జాగ్రత్తగా పనిచేసినప్పటికీ హీట్ ఎదుర్కోక త‌ప్ప‌లేదు`` అని తెలిసింది.

షూటింగ్ లో భాగంగా ఎన్టీఆర్ కి శరీరమంతా రక్తసిక్తంగా క‌నిపించాల్సిన‌ అవసరం ఉండ‌గా.. చాలా మంది మేకప్ మెన్ తో పాటు అక్కడికక్కడే  చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నారని సోర్స్ చెబుతోంది.  ఎన్టీఆర్ ను గొలుసులు... ఇనుప పెట్టెలతో చిత్రీకరించే సన్నివేశం ఒకానొక సమయంలో తప్పుగా తెర‌కెక్క‌డంతో ఆ షాట్ ను మళ్లీ చిత్రీకరించాల్సి వచ్చిందట‌.

కొమరం భీముడిని ర‌క్త‌సిక్తంగా చెమ‌ట‌ల‌తో త‌డిసిన‌ట్టు చూపించేందుకు చాలా స‌మ‌యం తీసుకున్నార‌ట‌. మొత్తానికి ఈ పాట చార్ట్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. విజువ‌ల్ గానూ గొప్ప మెప్పు పొందుతోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రం దాదాపు 600 కోట్లు పైగా వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఫైన‌ల్ రిపోర్ట్ కోసం ఇంకో వారం ప‌డుతుందేమో!
Tags:    

Similar News