వీడియో: గ్రేట్ ప్లేయ‌ర్స్ వాలీబాల్ ఆడుతున్నారుగా!

Update: 2021-07-27 10:30 GMT
పాన్ ఇండియా మూవీ RRR అక్టోబ‌ర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. జూనియ‌ర్ ఎన్టీఆర్- రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం పెండింగ్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతోంది. సైమ‌ల్టేనియ‌స్ గా నిర్మాణానంత‌ర ప‌నుల్ని పూర్తి చేస్తున్నారు. తాజాగా ఆన్ లొకేష‌న్ నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అభిమానులు ఈ వీడియోని వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

వీడియోలో తార‌క్- రాజమౌళి ఇద్దరూ ఇతర జట్టు సభ్యులతో వాలీబాల్ ఆడుతూ క‌నిపించారు. ఈ వీడియో ఇటీవలే కెమెరాలో బంధించార‌ని అర్థ‌మ‌వుతోంది. బిజీ షెడ్యూళ్ల నుంచి ఒత్తిడిని తొల‌గించుకునేందుకు కొంత విరామ‌ సమయం వాలీబాల్ కి కేటాయించారు. మొత్తానికి ఆట‌లో జ‌క్క‌న్న ప్ర‌తిభ ఏంటో ఈ వీడియో చెప్ప‌క‌నే చెబుతోంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు
`దోస్తీ` అనే మొదటి పాటను లాంచ్ చేస్తున్నామ‌ని ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్- అలియా భట్- ఒలివియా మోరిస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని బ‌హుభాష‌ల్లో అక్టోబర్ 13న విడుదల చేయ‌నున్నారు. హిందీలోనూ ఈ చిత్రం అత్యంత భారీగా విడుద‌ల‌వుతుంది.  బాహుబ‌లి రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ సినిమాకి క‌థ‌ను అందించారు. స్వాతంత్య్రోద్య‌మం దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో ఆద్యంతం రక్తి క‌ట్టించే సినిమా ఇది.

Tags:    

Similar News