జోరు పెంచిన చిరు.. ఈసారైనా గట్టెక్కుతారా?

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి మరో పోస్టర్ ను పంచుకున్నారు. అందులో చిరంజీవి యాక్షన్ సీక్వెన్స్ లో దూకుడుగా కనిపిస్తూ స్టైలిష్ లుక్ లో అందరిని ఆకట్టుకున్నారు.;

Update: 2025-12-24 18:36 GMT

మెగాస్టార్ చిరంజీవి.. ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా తన కొడుకు రామ్ చరణ్ తో పోటీగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న ఈయన.. ఆ చిత్రాలతో సరైన సక్సెస్ కొట్టాలని తెగ ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు.. పండక్కి వస్తున్నారు అనే ట్యాగ్ లైన్ తో వస్తోంది.. ప్రముఖ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అటు ఓటమెరుగని అనిల్ రావిపూడి దర్శకుడిగా.. ఇటు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి.




 



వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్స్ వదులుతూ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి మరో పోస్టర్ ను పంచుకున్నారు. అందులో చిరంజీవి యాక్షన్ సీక్వెన్స్ లో దూకుడుగా కనిపిస్తూ స్టైలిష్ లుక్ లో అందరిని ఆకట్టుకున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్లో గాయపడిన చిరంజీవి.. ఒక చేతితో గన్ను పట్టుకొని. మరొక చేతిని స్టైల్ గా నడుం పై పెట్టి అటు రౌద్రంగా ఇటు స్టైలిష్ గా కనిపిస్తూ అందరి హృదయాలను దోచుకున్నారు. ముఖ్యంగా డెనిమ్ జీన్స్ , వైట్ టీ షర్టు దానిపై డెనిమ్ కోట్ ధరించి పోస్టర్ కే సరికొత్త లుక్ తీసుకొచ్చారు చిరంజీవి. మొత్తానికైతే తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు.

ఇకపోతే సినిమా విడుదలకు కేవలం 19 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో అటు చిరంజీవి ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు. వారానికి రెండు మూడు అప్డేట్లు వదులుతూ ఈసారి ఎలాగైనా సరే భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈసారైనా చిరంజీవికి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ లభిస్తుందేమో చూడాలి. ఇక చివరిగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

అటు ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేశారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా వీఎఫ్ఎక్స్ కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కారణంగా ఈ సినిమాను వాయిదా వేశారు. అలాగే డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నా.. కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ఆగిపోయింది. మధ్యలో చిరంజీవికి ఆరోగ్యం బాగో లేకపోవడం వల్ల సినిమా షూటింగ్ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.

అలా పలు కారణాలవల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కాబోతోంది. అలాగే మరొకవైపు యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆఖరిలో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రమోషన్స్ లో జోరు పెంచేసి సినిమాపై అంచనాల పెంచుతున్న చిరంజీవి ఈసారైనా గట్టెక్కుతారేమో చూడాలి.

Tags:    

Similar News