అతివినయం ధూర్త లక్షణం.. శివాజీపై అనసూయ ఫైర్!

ఇక శివాజీ వాడిన ఆ రెండు అన్ పార్లమెంటరీ పదాల గురించి కూడా అనసూయ మాట్లాడారు. "మీరు అంత ధైర్యంగా, అంత బల్ల గుద్ది ఆ పదాలు వాడేసి, ఇప్పుడు సింపుల్ గా సారీ చెప్పేసి మర్చిపోమంటే కుదరదు.;

Update: 2025-12-24 18:43 GMT

నటుడు శివాజీ వ్యాఖ్యలపై యాంకర్ అనసూయ చాలా ఘాటుగా స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడుతూ శివాజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "అతివినయం ధూర్త లక్షణం" అంటూ మొదలుపెట్టి, శివాజీ ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చారు. తప్పు చేసి మళ్లీ అతి వినయం నటించడం సరికాదని హితవు పలికారు.

శివాజీకి ఆడవారి డ్రెస్సింగ్ సెన్స్ పై మాట్లాడే అర్హత లేదని అనసూయ తేల్చి చెప్పారు. "మీరు మాకు బట్టలు ఎలా వేసుకోవాలో చెప్పే చిన్న పిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మాకు తెలుసు. మమ్మల్ని మా ఇష్టానికి జీవించనివ్వండి అని చాలా వినమ్రతతో ప్రార్థిస్తున్నాం" అని ఎద్దేవా చేశారు.

తనకు హీరోయిన్స్ పట్ల ఇన్ సెక్యూరిటీ ఉందని శివాజీ చెప్పిన మాటలను అనసూయ ఖండించారు. నిజంగా మీకు అంత కన్సర్న్ ఉంటే, ఆడవాళ్ళ మీద పడొద్దని, అడవి జంతువుల్లా ప్రవర్తించవద్దని మగవాళ్లకు చెప్పండి. అంతేగానీ ఆడవాళ్ళకు బట్టలు వేసుకోవద్దని చెప్పడం ఏంటి అని ప్రశ్నించారు. మీ ప్రొటెక్షన్, మీ కన్సర్న్ మాకు అవసరం లేదని, మమ్మల్ని మేము చూసుకోగలమని స్ట్రాంగ్ గా బదులిచ్చారు.

ఇక శివాజీ వాడిన ఆ రెండు అన్ పార్లమెంటరీ పదాల గురించి కూడా అనసూయ మాట్లాడారు. "మీరు అంత ధైర్యంగా, అంత బల్ల గుద్ది ఆ పదాలు వాడేసి, ఇప్పుడు సింపుల్ గా సారీ చెప్పేసి మర్చిపోమంటే కుదరదు. మీరు చేసిన వ్యాఖ్యలు మీ అసలు స్వరూపాన్ని బయటపెట్టాయి. ఆ రోజు ఈవెంట్ లో మీరు మాట్లాడిన టోన్ మీ నిజస్వరూపం" అని విమర్శించారు.

తన భర్త, తన స్నేహితులు, తన చుట్టూ ఉన్న మగవాళ్ళు తనకు ఎంతో సపోర్ట్ గా ఉంటారని, తనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని అనసూయ స్పష్టం చేశారు. "ఐ యామ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. మీలాంటి వాళ్ళు అసలు మా దరిదాపుల్లోకి కూడా రావద్దు" అని వార్నింగ్ ఇచ్చారు. తనను, చిన్మయిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని ఆమె ప్రస్తావించారు.

చివరగా, ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్లకు దూరంగా ఉండటమే మంచిదని, తన పర్సనల్ ఛాయిస్ ని గౌరవించాలని అనసూయ కోరారు. బట్టలు అనేవి సీజన్ ని బట్టి, కంఫర్ట్ ని బట్టి వేసుకుంటారని, దానికి క్యారెక్టర్ కి లింక్ పెట్టడం మూర్ఖత్వం అని ఆమె అభిప్రాయపడ్డారు. శివాజీకి స్పీడీ రికవరీ కావాలని కోరుకుంటున్నట్లు వ్యంగ్యంగా ముగించారు.


Tags:    

Similar News